టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి శ్రీ లీల ( Sreeleela ) ఒకరు.ఈమె పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే మొదటి సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన తన నటన అందంతో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.అనంతరం ఈమెకు రవితేజ హీరోగా నటించిన ధమాకా( Dhamakha ) సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ లీలకు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు వచ్చాయి.ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ సినిమాల ద్వారా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.
ఈ విధంగా శ్రీ లీల నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి ప్రస్తుతం అనుకున్న స్థాయిలో సినిమాలలో ఈమె నటించలేదు.పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు రవితేజ సినిమాలో బిజీగా ఉన్నారు.వీటితో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాన్ని కూడా అందుకుంటూ ఈ సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండదా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావడానికి మా ఫ్యామిలీ ఒప్పుకోలేదని ,ఎవరికీ ఇష్టం లేదని తెలిపారు.మా ఫ్యామిలీలో అందరూ కూడా డాక్టర్లు, నేను కూడా డాక్టర్ అవ్వాలన్నది వారి కల.అందుకే ఒప్పుకోలేదని తెలిపారు.కానీ మా తాతయ్య మాత్రం నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు.
ఆయన వల్లే నేను ఇండస్ట్రీలోకి రాగలిగానని శ్రీ లీల తెలిపారు.ఇక ఈమె తల్లి కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ అనే సంగతి మనకు తెలిసిందే.
అయితే శ్రీ లీల కూడా ఒకవైపు డాక్టర్ (Doctor) చదువుతూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.