టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.నందమూరి తారక రామారావు ( Nandamuri Taraka Ramarao ) మనవడిగా ఈయన ఇండస్ట్రీలోకి బాలా నటుడిగానే ఎంట్రీ ఇచ్చి నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు కూడా ఆరాటపడుతూ ఉంటారు అలాగే ఎన్టీఆర్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ( Telugudesam Party ) తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు కానీ కొంతమంది ఈయనను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంచుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఇక ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడని ఆయనే ఎన్టీ రామారావు గారి అసలు వారసుడు అంటూ అభిమానులు పలు సందర్భాలలో కామెంట్లు చేస్తూ ఉంటారు అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధ వెంకన్న( Budda Venkanna ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.నేను టీడీపీలోనే కొనసాగుతాను.
చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పని చేయడానికి సిద్దం.కానీ, ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేయను అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి మనవడే కావచ్చు కానీ ఆయన ఒక్కరే మనవడు కాదు కదా… ఆయనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నారా లోకేష్ ( Nara Lokesh ) కూడా ఎన్టీఆర్ కి మనవడే కదా.ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేయలేదా అంటూ ఎన్టీఆర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.