ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా మిస్టర్ బచ్చన్ సినిమా( Mr.Bachchan movie ) గురించి మాట్లాడుకుంటున్నారు.దానికి కారణం ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిందని కాదు.ఈ సినిమా రిలీజ్ కి ముందు హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కామెంట్లు ఆ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.
ఇక ఫలితం మాత్రం దానికి విరుద్ధంగా రావడంతో ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు హరీష్ శంకర్ ను టోల్ చేస్తూ ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా గురించి మాట్లాడుతున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హరీష్ శంకర్ చాలామంది మీద ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారనే విషయాలు కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ శీను, చమ్మక్ చంద్ర లు కొంతవరకు కామెడీని పండించి ప్రయత్నం అయితే చేశారు.ఇక అందులో భాగంగానే చమ్మక్ చంద్ర( Chammak Chandra ) కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.
ప్రభాస్ శీను మాత్రం డైరెక్టర్ గా కనిపిస్తాడు.ఇక వీళ్ళ సిచువేషన్ కు తగ్గట్టుగానే ప్రభాస్ శ్రీను కి గురూజీ అనే పేరు పెట్టాడు.ఇక ప్రభాస్ శ్రీను ఏది చెబితే పక్కనున్న ఆర్టిస్ట్ అయిన చమ్మక్ చంద్ర అది చేస్తూ ఉంటాడు.
ఇక ఈ ప్రాసెస్ ను అంతా గమనించిన సినీ మేధావులు గాని, ప్రేక్షకులు గాని ప్రభాస్ శీను, చమ్మక్ చంద్ర క్యారెక్టర్లను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ( Pawan Kalyan, Trivikram )లను ఉద్దేశించే వాటిని రాసుకున్నాడు అంటూ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పైన ఫైర్ అవుతున్నారు.
నిజానికి ఇండస్ట్రీలో గురూజీ అని త్రివిక్రమ్ గారిని మాత్రమే పిలుస్తుంటారు.ఇక త్రివిక్రమ్ ఎలా చెబితే అలా వినే ఒకే ఒక్క నటుడు పవన్ కళ్యాణ్… వాళ్ళిద్దరికీ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.
మరి హరీష్ శంకర్ వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ఎందుకు ఆ సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాడు అనేది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.నిజానికి పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ కి మధ్య మంచి ర్యాపో ఉంది.అయినప్పటికీ త్రివిక్రమ్ మీద ఎందుకు ఈయనకు కోపం ఉందనే విషయాలు తెలియాల్సి ఉంది.ఇక ఒక వర్గం వారు చెబుతున్న సమాచారం ప్రకారం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అవ్వడానికి త్రివిక్రమ్ గారే కారణమని అందువల్లే హరీష్ శంకర్ త్రివిక్రమ్ మీద చాలా వరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకు అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా( Ustad Bhagat Singh movie ) షూటింగ్ సమయంలో సముద్ర ఖని లాంటి డైరెక్టర్ ను తీసుకువచ్చి ‘ బ్రో ‘ అనే సినిమాను త్రివిక్రమ్ సెట్ చేశాడు.ఇక త్రివిక్రమ్ ఏది చెప్తే పవన్ కళ్యాణ్ అది వింటాడు.కాబట్టి బ్రో సినిమా చేయడానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక అప్పటి నుంచి హరీష్ శంకర్ కోపంతో ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక చూడాలి మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది…
.