లైనప్ విషయంలో స్టార్ హీరో ప్రభాస్ కు తిరుగులేదుగా.. పోటీ ఇచ్చే హీరో లేరంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికి తెలిసిందే.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Pan India Star Prabhas Lineup, Pan India Star, Prabhas, Movies ,lineup, Tollywoo-TeluguStop.com

ఇటీవల కల్కి,సలార్ ( Kalki, Salar )వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇక తాజాగా విడుదలైన కల్కి సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ అదే ఊపుతూ తదుపరి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Telugu Lineup, Pan India, Panindia, Prabhas, Tollywood-Movie

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. రాజాసాబ్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె, సలార్ 2,కల్కి 2 ( Rajasaab, Spirit, Project K, Salar 2, Kalki 2 )లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్నారు ప్రభాస్.అలా ప్రస్తుతం మరే స్టార్ హీరో చేతిలో లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.ఈ విషయంలో ప్రభాస్ కు పోటీ ఇచ్చే హీరోలు ఎవరూ లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అంతేకాకుండా ఈ విషయంలో ప్రభాస్ కి ప్రభాసే సాటి అని చెప్పవచ్చు.పైగా ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, విభిన్న జానర్ సినిమాలు కావడం విశేషం.

Telugu Lineup, Pan India, Panindia, Prabhas, Tollywood-Movie

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలను గమనిస్తే.సాహో యాక్షన్ థ్రిల్లర్ కాగా, రాధేశ్యామ్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా.ఆది పురుష్ మైథలాజికల్ మూవీ కాగా, సలార్ యాక్షన్ థ్రిల్లర్.ఇక గత చిత్రం కల్కి 2898 AD మైథలాజికల్ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీలో చేస్తున్నాడు ప్రభాస్.ఇది రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్.అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని ప్రకటించాడు.ఇది హిస్టారికల్ ఫిక్షన్ మూవీ.

దీని తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు ప్రభాస్.ఇది యాక్షన్ ప్యాక్డ్ కాప్ డ్రామాగా రూపొందనుంది.

ఇలా విభిన్న జానర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్.పైగా ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube