తెలుగులో చాలామంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.అయితే ఈ హీరోలలో కొంతమంది చాలా సాధారణంగా అనిపించే పనులు కూడా చేయలేకపోతుంటారు.
ఒక మనిషి అన్ని పనులు చేయడం అసాధ్యం.కాబట్టి వీళ్లు కొన్ని పనులు చేయలేకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.
కానీ వాళ్లు ఏ పనులు చేయలేరో తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.ఆ పనులేవో, వాటిని చేయలేని టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం.
• మహేష్ బాబు
( Mahesh Babu )
సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించాడు.తెలుగు కుటుంబంలోనే జన్మించినా మహేష్ బాబుకు( Mahesh Babu ) తెలుగు చదవడం గానీ రాయడం గానీ రాదు.
ఇది వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు కానీ ఈ విషయాన్ని ఒకానొక ఇంటర్వ్యూలో మహేష్ బాబే ఒప్పుకున్నాడు.ఈ స్టార్ హీరో తమిళనాడులోని చెన్నైలో పుట్టాడు.అక్కడే పెరిగాడు.బ్యాచిలర్ డిగ్రీ దాకా చెన్నై( Chennai )లోనే చదువుకున్నాడు.
పుట్టడం, చదువుకోవడం, పెరగడం మొత్తం చెన్నైలోనే జరిగింది కాబట్టి ఆయన తెలుగు రాయడం, చదవడం నేర్చుకోలేకపోయాడు.అప్పట్లో తమిళంలో రాయడం చదవడం నేర్చుకున్నాడు కానీ తెలుగు మాత్రం నేర్చుకునే వీలు దొరకలేదు.
• నేచురల్ స్టార్ నాని
( Nani )
నేచురల్ స్టార్ నాని చాలా టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.ఈ హీరో చేయలేని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు.అయితే ఈ నటుడు ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ( Phone Pay, Google Pay )లాంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడటం ఎలాగో తెలియక ఇబ్బంది పడ్డాడట.వాస్తవానికి వీటిని ఉపయోగించడం చాలా సులభం.
కానీ నాని మాత్రం వీటి ద్వారా పేమెంట్స్ చేయలేకపోయాడట.నాని మొబైల్ ఫోన్ బాగా యూజ్ చేస్తుంటాడు కానీ కొత్త టెక్నాలజీని ఇతరుల వలె అంత త్వరగా అర్థం చేసుకోలేడని అంటారు.
• రానా దగ్గుబాటి
( Rana Daggubati )
బాహుబలి ఫేమ్ రానా ఒకానొక సమయంలో తనకు బైక్ నడపడమే రాదు అని చెప్పి షాక్ ఇచ్చాడు.సాధారణంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి హీరో కూడా తమ సినిమాల్లో స్టైలిష్ బైక్స్ రైడ్ చేస్తూ ఆకట్టుకున్నారు.హీరోయిన్లను బైక్ పై ఎక్కించుకొని తీసుకువెళ్లే సన్నివేశాలు కూడా చేయాల్సి వస్తుంది.సినిమాల్లో ఏదో ఒక సందర్భంగా బైక్ నడపాల్సిన అవసరం ఉంటుంది కానీ రానా మాత్రం బైక్ రైడింగ్ నేర్చుకోకుండానే స్టార్ హీరో అయిపోయాడు.