ఈ స్టార్ డైరెక్టర్ల పని అయిపోయిందా.. వీళ్లు తీసే సినిమాలు ఇకపై ఆడవా..?

బాహుబలి, పుష్ప, కల్కి వంటి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్‌కి చేరుకుంది.బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కూడా హాలీవుడ్‌కి ఏ మాత్రం తీసుపోనీ విధంగా మన తెలుగు సినిమాలు నిలుస్తున్నాయి.

 Tollywood Directors Who Are Not In Foml ,puri Jagannath , Harish Shankar , Tol-TeluguStop.com

ప్రభాస్ తీస్తున్న సినిమాలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి.రీసెంట్ టైమ్స్‌లో కొందరు తెలుగు దర్శకులు సెన్సేషనల్ హిట్స్ సాధిస్తున్నారు.

టాలీవుడ్ హీరోలను పాన్ వరల్డ్ వైడ్ గా పాపులర్ చేస్తున్నారు.ఈ డైరెక్టర్లు ఇలా దూసుకు వెళ్తుంటే మరి కొంతమంది డైరెక్టర్లు మాత్రం రొటీన్ రొట్ట సినిమాలు తీస్తూ షాక్ ఇస్తున్నారు.

ఒకప్పుడు వీళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్‌ చేసిన వారే! కానీ అప్పట్లో ఎలాంటి సినిమాలు తీశారో ఇప్పుడు కూడా అవే మూవీలు తీస్తూ చిరాకు తెప్పిస్తున్నారు.

Telugu Anil Ravipudi, Bobby, Harish Shankar, Liger, Bachchan, Puri Jagannath-Mov

కాలంతో పాటు సినిమా ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయనే సంగతిని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.అలాంటి డైరెక్టర్లలో పూరి జగన్నాథ్, హరీష్ శంకర్( Puri Jagannath , Harish Shankar ) , అనిల్ రావిపూడి, బాబీ, పరుశురాం ఉన్నారు.డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెలుగు సినిమా స్థాయిని వేరే రేంజ్‌కు తీసుకువెళ్లాలని రాజమౌళి లాంటి దర్శకులు ప్రయత్నాలు చేస్తుంటే వీరు మాత్రం కమర్షియల్ మూవీస్ చేసి సింపుల్‌గా హిట్స్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

ఒక సక్సెస్ ఫార్ములా తయారు చేసుకొని ఇక అలాంటి కథలు, కామెడీ, పాటలు, యాక్షన్ మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు.కానీ ప్రేక్షకులు కొత్త కథలను కోరుకుంటున్నాను కాబట్టి ఇవి ఫెయిల్ అవుతున్నాయి.

ఈరోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

Telugu Anil Ravipudi, Bobby, Harish Shankar, Liger, Bachchan, Puri Jagannath-Mov

థియేటర్లకు రప్పించాలంటే సినిమాలు చాలా గొప్ప కథలతో రావాల్సి ఉంటుంది.థియేటర్ లో చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుందనే నమ్మకం కుదరాలి.లేకపోతే ఇటీవల కాలంలో హిట్స్ అందుకోవడం చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు.సాధారణంగా ఈ డైరెక్టర్లు కొత్త సినిమాలను ప్రకటించగానే ప్రేక్షకుల్లో అంచనాలు చాలా పెరిగిపోతున్నాయి.ఉదాహరణకి పూరి జగన్నాథ్ లైగర్( Liger) అనే కొత్త కాన్సెప్ట్ సినిమా తీస్తున్నామని చెప్పాడు.కానీ ఈ సినిమా కథలో బలం లేకపోవడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది.

పూరి జగన్నాథ్ ఇంతకుముందు చాలా హిట్స్ సాధించాడు.అందువల్ల లైగర్ కూడా చాలా బాగుంటుందని అనుకున్నారు కానీ అది అస్సలు బాగోలేదు.

ఈ దర్శకులు పాన్ ఇండియా డైరెక్టర్లుగా తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి తల వంపులు తీసుకొస్తున్నారు.మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) సినిమాతో హరీష్ శంకర్ ఎంత డిసప్పాయింట్ చేశాడో చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీలో రవితేజ హీరోయిన్ తో వెకిలి డాన్సులు చేస్తూ షాకిచ్చాడు.

ఒకవైపు నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక్క అవార్డు కూడా లభించలేదు.అది చాలా అవమానకర విషయం అని చెప్పుకోవచ్చు.రాజమౌళి లాంటి దర్శకులు మన తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇండస్ట్రీ పరువును దిగజార్చేలా సినిమాలు చేస్తున్నారు.మొత్తం మీద ఇలాంటి డైరెక్టర్ల సినిమాలకు కాలం చెల్లిందని చెప్పవచ్చు.

వీళ్లు ఔట్ డేటెడ్ మైండ్ సెట్ తో సినిమాలు ప్రేక్షకులు పైన రుద్దుతున్నారు.అయితే రియాక్షన్ గా వారి సినిమాలు ఎదురు తన్నుతున్నాయి.

వీళ్ళు ఇప్పటికైనా మారతాలో లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారు చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube