దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఏ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా?

దంతాలు ఆరోగ్యంగా ఉండాల‌నే ఉద్ధేశంతో చాలా మంది ఖ‌రీదైన టూత్ బ్రెష్‌లు, పేస్ట్‌లు వాడుతుంటారు.ఇది మంచి అల‌వాటే.

 Best Tips, Oral Health, Healthy Teeth, Teeth, Health Tips, Good Health, Health,-TeluguStop.com

కానీ.బ్రెష్‌లు, పేస్ట్‌ల‌తోనే దంతాలు ఆరోగ్యంగా మార‌తాయి అనుకోవ‌డం పొర‌పాటు.

నిజానికి దంతాలు హెల్తీగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Telugu Tips, Care Tips, Healthy Teeth, Oral, Teeth-Telugu Health - తెలు�

దంతాలు దృఢంగా గ‌ట్టిప‌డాలంటే పౌష్టికాహారం ఎంతో అవ‌స‌రం.అందుకే పాలు, పాల ఉత్ప‌త్తులు, గుడ్లు, సిట్ర‌స్ ఫ్రూట్స్‌, తాజా కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, తృణ‌ధాన్య‌లు, న‌ట్స్‌ వంటి ఆహారాల‌ను డైట్‌లో ఖ‌చ్చితంగా చేర్చుకోవాలి.

నువ్వుల నూనె.దంతాల‌కు ఎంతో మేలు చేస్తుంది.వారంలో మూడు లేదా నాలుగు సార్లు అయినా నువ్వుల నూనెతో నోటిని పుక్క‌లించాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు శుభ్ర ప‌డ‌టంతో పాటు ఆరోగ్యంగానూ మార‌తాయి.

అలాగే అప్పుడ‌ప్పుడు పచ్చి ఉల్లిపాయ‌లు బాగా న‌మిలి తినాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లి గ‌డ్డ‌ల్లో ఉండే సల్ఫర్ నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశ‌నం చేసి.దంతాల‌ను, చిగుళ్ల‌ను బ‌ల‌ప‌రుస్తుంది.

చీజ్ సైతం దంత ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌గ‌ల‌దు.

చీజ్‌ను త‌ర‌చూ తీసుకుంటే గ‌నుక‌.అందులో ఉండే కాల్షియం మ‌రియు ఇత‌ర పోష‌కాలు దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చూయింగ్ గమ్స్ దంతాల‌కు మంచివి కాద‌ని చాలా మంది భావిస్తుంటారు.కానీ, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ను అప్పుడ‌ప్పుడు న‌మిలితే ప‌ళ్ళ చుట్టూ పేరుకు పోయిన బ్యాక్టీరియాను తొల‌గించి.

దంతాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షణ క‌ల్పిస్తుంది.

Telugu Tips, Care Tips, Healthy Teeth, Oral, Teeth-Telugu Health - తెలు�

ఇక టీ, కాఫీల‌కు బ‌దులుగా ప్ర‌తి రోజూ ఒక క‌ప్పు గ్రీన్ టీని సేవించాలి.త‌ద్వారా గ్రీన్ టీలో ఉండే ప‌లు పోష‌కాలు దంతాల‌కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోక‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.పైగా గ్రీన్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను కూడా పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube