మోదీ మూడోసారి ప్రధాని అవుతారు అంటున్న పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈరోజు ఉదయం మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అనంతరం వారణాసి పయనమయ్యారు.

 Pawan Kalyan Says Modi Will Become Prime Minister For The Third Time Details, P-TeluguStop.com

రేపు ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్డీఏ భాగస్వామి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది.

మోదీ ఆహ్వానం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజీనోవాతో( Anna Lezhneva ) కలసి వారణాసి చేరుకోవడం జరిగింది.ఈ క్రమంలో విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

Telugu Anna Lezhneva, Ap, Bjpjanasena, Modi, Nda Alliance, Pawan Kalyan, Pm Modi

కచ్చితంగా తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.బలమైన మెజారిటీతో.ఎన్డీఏ కూటమి( NDA Alliance ) తిరుగులేని విజయం సాధిస్తుందని అన్నారు.మోదీ మూడోసారి ప్రధాని అవుతారు.ఆయన నామినేషన్ కార్యక్రమానికి రావటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.పవన్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం( Pithapuram ) నుండి పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి పిఠాపురం నుండి పోటీ చేయటంతో పవన్ గెలుపు పై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

Telugu Anna Lezhneva, Ap, Bjpjanasena, Modi, Nda Alliance, Pawan Kalyan, Pm Modi

పవన్ గెలవాలని పిఠాపురంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు ప్రచారం చేశారు.ఎలాగైనా పిఠాపురం నుండి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.అలాగే మొదటి నుండి వైసీపీ పార్టీని అధికారంలోకి దించాలని.చాలా వ్యూహాత్మకంగా రాజకీయం చేశారు.టీడీపీ.బీజేపీ పార్టీలను కలపటంలో పెద్దన్న పాత్ర పోషించారు.సీట్ల విషయంలో త్యాగం చేశారు.2014లో మాదిరిగా గెలవాలని పవన్ భావించడం జరిగింది.మరి ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో జూన్ 4న తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube