సాధారణంగా ప్రపంచ దేశాలు తమ ప్రాంతాలకు టూరిస్ట్లను సంతోషంగా ఆహ్వానిస్తాయి.ఎందుకంటే టూరిస్ట్ల వల్ల స్థానిక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
పర్యాటకులు దేశ ఆర్థికాభివృద్ధికి చాలా దోహదపడతారు.ఇంకా చాలానే ప్రయోజనాలు చేకూరతాయి.
ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఓ ఊరు మాత్రం టూరిస్ట్లను బ్యాన్ చేస్తోంది.దానికి కారణం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బాలెరిక్ దీవులలో( Balearic Islands ) ఒక చిన్న, ప్రశాంతమైన ద్వీపం ఉంది.దాని పేరు మెనోర్కా.( Menorca ) స్పెయిన్కు చెందిన ఈ ద్వీపం మధ్యధరా సముద్రంలో ఉంది.దాని పెద్ద పొరుగు ద్వీపం మాజోర్కా కంటే మెనోర్కా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.
జనాల తాకిడి అసలే ఉండదు.వాస్తవానికి, మెనోర్కా అనే పేరుకు స్పానిష్లో “చిన్న ద్వీపం” అని అర్థం.
మెనోర్కా ద్వీపం చాలా పురాతనమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది, ఇవి ద్వీపంలో ప్రారంభ మానవ జీవితానికి ఆధారాలు.వీటిలో “నవెట్స్”, “టౌలెస్”, “టాలయోట్స్” వంటివి ఉన్నాయి, ఇవి ఈ ద్వీపానికి ప్రత్యేకమైనవి, చరిత్రను ప్రతిబింబిస్తాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో మెనోర్కా ద్వీపానికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది.ఈ ఏడాది వేసవిలో 10 లక్షలకు పైగా సందర్శకులు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ పెరుగుదల కొన్ని సమస్యలకు దారితీసింది.మెనోర్కాలోని బినిబెకా వెల్( Binibeka Well ) అనే ఒక అందమైన గ్రామంలోని స్థానికులు పర్యాటకుల ప్రవర్తనతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.
ఇళ్లలోకి చొరబడటం, బాల్కనీలపైకి ఎక్కడం వంటి అవాంఛనీయ చర్యలకు టూరిస్ట్స్ పాల్పడుతున్నారు.అందుకే ఈ ఊరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెల్లని రంగులో పెయింట్ చేసిన ఇళ్లతో బినిబెకా వెల్ గ్రామం చూడచక్కని విధంగా ఉంటుంది.పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య కారణంగా కలిగే ఇబ్బందులను తగ్గించడానికి, గతేడాది బినిబెకా వెల్ గ్రామం పర్యాటకులను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే గ్రామాన్ని సందర్శించాలని కోరింది.ఈ రూల్ ద్వారా ఇబ్బందులను తగ్గించాలని ఆశించారు.కానీ సమస్యలు కొనసాగుతున్నాయి, ఈ కారణంగా గ్రామం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తోంది.గ్రామస్థుల ప్రతినిధి అయిన ఆస్కార్ మోంజే, బినిబెకా వెల్ ఒక పర్యాటక ప్రదేశం కాదని, ప్రజలు తమ రోజువారీ జీవితాలను గడిపే ఒక ప్రైవేట్ కమ్యూనిటీ అని స్పష్టం చేశారు.పర్యాటకులు గ్రామ నియమాలను పాటించకపోతే, వారిని పూర్తిగా నిషేధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

మెనోర్కా పర్యాటక శాఖ డైరెక్టర్ బెగోనా మెర్కాడాల్, బినిబెకా వెల్ గ్రామస్తుల నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు.గ్రామం ప్రైవేట్ ఆస్తి కాబట్టి, దానిని పర్యాటకులకు మూసివేసే హక్కు యజమానులకు ఉందని ఆమె స్పష్టం చేశారు.బాలెరిక్ దీవులు పర్యాట పరిశ్రమను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి.గౌరవప్రదమైన పర్యాటకులను ఆకర్షించడం, సమస్యలను కలిగించే చౌకైన సెలవుల కోసం వెతుకుతున్న వారిని నిరుత్సాహపరచడం దీవులు లక్ష్యం పెట్టుకున్నాయి.







