ఒకప్పుడు మైగ్రేన్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.కానీ ఇటీవల రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మంది మైగ్రేన్ తల నొప్పితో మదన పడుతున్నారు.
కంటి నిండా నిద్ర లేకపోవడం, అతిగా నిద్ర పోవడం, శారీరక మానసిక ఒత్తిడి, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం వంటివి మైగ్రేన్ తలనొప్పికి ప్రధాన కారణాలు.మామూలు తలనొప్పి తో పోలిస్తే మైగ్రేన్ చాలా భయంకరంగా మరియు బాధాకరంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడం కోసం మందులు వాడుతుంటారు.
అయితే సహజ పద్ధతుల్లోనూ ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్‌లో ఒక కప్పు బాదం పప్పు వేసి వేయించుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, బాదంపప్పు, గసగసాలు మరియు పది గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ లో ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి తీసుకోవాలి.ప్రతిరోజు ఈ పొడిని పాలలో మిక్స్ చేసి తీసుకుంటే.మైగ్రేన్ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.
గసగసాలు, ఎండు ఖర్జూరం, బాదంపప్పు మరియు ఎండు కొబ్బరిలో ఉండే ప్రత్యేక పోషకాలు మైగ్రేన్ ని వదిలించడానికి గ్రేట్ గా సహాయపడతాయి.అలాగే మన ఆరోగ్యానికి మరెన్నో అమోఘమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
కాబట్టి మైగ్రేన్ తలనొప్పితో వర్రీ అవుతున్న వారు తప్పకుండా ఈ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.