మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య, మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతుంది.టీడీపీ, జనసేన పొత్తు విషయంలో వార్ నడుస్తోంది.
ఈ క్రమంలో హరిరామజోగయ్యకు మంత్రి అమర్నాథ్ రెండవ లేఖ రాశారు.వంగవీటి మోహన రంగాని చంపించిన చంద్రబాబుతో పవన్ పొత్తును సమర్ధిస్తారా అని లేఖలో ప్రశ్నించారు.
కాపుల భవిష్యత్ విషయంలో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కల్యాణ్ కు రాయాల్సిన లేఖను పొరపాటున తనకు రాశారన్నారు.అనంతరం మీరు పూర్తి ఆరోగ్యంతో మానసిక ధృడంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.







