సాధారణంగా ప్రతి ఒక్కరికీ ప్రతి రోజు ఎంతో కొంత జుట్టు రాలుతుంటుంది.కానీ, కొందరికి మాత్రం ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పోషకాల కొరత, హార్మోన్ ఛేంజస్, పలు రకాల మందుల వాడకం.ఇలా ఏదో ఒక కారణం వల్ల హెయిర్ ఫాల్ హెవీగా ఉంటుంది.
దాంతో ఈ సమస్యను నివారించుకునేందుకు వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ వాడతారు.ఎన్నెన్నో షాంపూలను మారుస్తారు.
అయినప్పటికీ ఫలితం లేకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు.
అయితే సరైన చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే హెయిర్ ఫాల్‌ను నివారించుకోవచ్చు.
అందుకు ముఖ్యంగా స్వీట్ పొటాటో(చిలకడదుంప) అద్భుతంగా సహాయపడుతుంది.అవును, స్వీట్ పొటాటోలో ఉండే పలు పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూర్చి.
ఊడటానికి అడ్డు కట్ట వేస్తాయి.మరి ఇంతకీ స్వీట్ పొటాటోను జుట్టుకు ఎలా వాడాలో ఆలస్యం చేయకుండా చూసేయండి.
ముందు రెండు స్వీట్ పొటాటోలను తీసుకుని మెత్తగా ఉడికించుకోవాలి.ఆ తర్వాత పీల్ తీసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఐదారు స్పూన్ల స్వీట్ పొటాటో పేస్ట్, రెండు స్పూన్లు పుల్లటి పెరుగు, ఒక స్పూన్ నువ్వుల నూనె, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు తలకు రెగ్యులర్ ఆయిల్‌ను అప్లై చేసుకుని.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంతరం కెమికల్స్ లేని ష్యాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఇలా నాలుగు రోజులకు ఒక సారి చేస్తే గనుక హెవీ హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది.