వారానికి ఒక్కసారైనా సొరకాయ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సొరకాయ.( Bottle Gourd ) ఈ పేరు వింటే చాలు చాలా మంది ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంటారు.ఎక్కువ శాతం మంది సొరకాయను తినడానికి అస్స‌లు ఇష్టపడరు.ఇదొక బోరింగ్ కూరగాయగా భావిస్తారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే కచ్చితంగా చాలా ఆరోగ్య లాభాలను కోల్పోతున్నారు.

 Health Benefits Of Eating Bottle Gourd At Least Once A Week Details, Bottle Gour-TeluguStop.com

నిజానికి వారానికి ఒకసారైనా సొరకాయను తినమని న్యూట్రిషన్ స్పెష‌లిస్ట్‌లు సూచిస్తున్నారు.ఎందుకంటే, సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇంగ్లీష్ లో సొర‌కాయ‌ను బాటిల్ గూర్డ్ మరియు హిందీలో లౌకి అని పిలుస్తారు.సొరకాయలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి, విటమిన్ కెతో సహా అనేక‌ విటమిన్స్ సొర‌కాయ‌లో నిండి ఉంటాయి.

బరువు తగ్గడానికి( Weight Loss ) సొర‌కాయ మంచి ఎంపిక అవుతుంది.సొర‌కాయ‌లో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.మరియు నీటిని కలిగి ఎక్కువ‌గా ఉంటుంది.డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

అందువ‌ల్ల త‌ర‌చూ సొర‌కాయ‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటే సుల‌భంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Pressure, Bottle Gourd, Bottlegourd, Tips, Latest, Vegetables-Telugu Heal

అలాగే సొర‌కాయ అనేది కాలేయ సమస్యలకు చికిత్స చేయడానికి మరియు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి ఒక సహజ నివారణగా ప‌ని చేస్తుంది.వారానికి ఒక‌సారి సొర‌కాయ‌ను తీసుకుంటే కాలేయ పనితీరును మెరుగుపడుతుంది.సొర‌కాయ‌లో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది.

ఇది రక్తపోటును( Blood Pressure ) నియంత్రించే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఒక ఖనిజం.అందువ‌ల్ల అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు సొర‌కాయను డైట్‌లో చేర్చుకుంటే బీపీ కంట్రోల్ లోకి వ‌స్తుంది.

Telugu Pressure, Bottle Gourd, Bottlegourd, Tips, Latest, Vegetables-Telugu Heal

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారికి సొరకాయ ఒక వరం అనే చెప్పుకోవచ్చు.వారానికి ఒకటి లేదా రెండు సార్లు సొరకాయ జ్యూస్ తీసుకుంటే మూత్ర మార్గం యొక్క‌ అంటువ్యాధులకు చెక్ పెట్టవచ్చు.అంతేకాదు సొర‌కాయ ఆరోగ్యకరమైన మరియు సమర్థవంతమైన జీర్ణవ్యవస్థకు దోహదపడుతుంది.సొర‌కాయ‌లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube