సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ విషయంలో చాలా కేర్ గా ఉంటారు.ముఖ్యంగా షేవింగ్‌కు యూజ్ చేసే క్రీమ్స్ ను ఏరి కోరి ఎంచుకుంటారు.
ఈ క్రమంలోనే వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు.అయితే ఎంత ఖరీదైన షేవింగ్ క్రీమ్ వాడినా.
అందులో ఉండే కొన్ని కెమికల్స్ చర్మాన్ని క్రమంగా దెబ్బ తీస్తుంది.అందుకే న్యాచురల్ షేవింగ్ క్రీమ్స్నే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
అసలు ఇంతకీ న్యాచురల్ షేవింగ్ క్రీమ్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.? మరి ఎందుకు లేటు చూసేయండి అవేంటో.
తేనె ఒక అద్భుతమైన న్యాచురల్ షేవింగ్ క్రీమ్‌గా చెప్పుకోవచ్చు.అవును, తేనెలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకుని.ఆ వెంటనే షేవింగ్ చేసుకోవాలి.షేవింగ్ తర్వాత గడ్డం చాలా బరుకుగా ఉంటుంది.కానీ, తేనె యూజ్ చేస్తే చర్మం స్మూత్‌గా ఉంటుంది.
కలబందను కూడా షేవింగ్ క్రీమ్‌గా యూజ్ చేసుకోవచ్చు.
కలబంద జెల్‌ను ఉపయోగించడం ద్వారా చాలా స్మూత్ గా.ఎలాంటి గాయాలు కాకుండా షేవ్ చేసుకోవచ్చు.కలబందను వాడటం వల్ల ఎటువంటి చికాకు ఉండదు.
పీనట్ బటర్‌తో కూడా షేవింగ్ చేసుకోవాలి.
ఒక బౌల్లో మూడు, నాలుగు స్పూన్ల పీనట్ బటర్ వేసుకుని.అందులో ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అప్లై చేసి షేవింగ్ చేసు కోవచ్చు.షేవింగ్ క్రీమ్‌కు బదులుగా పీనట్ బటర్ వాడితే చర్మం మృదువుగా, షైనీగా కూడా ఉంటుంది.
బేబీ ఆయిల్‌తోనూ షేవింగ్ చేసుకోవచ్చు.బేబీ ఆయిల్‌ను చర్మానికి పూసుకుని.అపై షేవింగ్ చేసుకోవాలి.ఇలా బేబీ ఆయిల్‌ను వాడటం వల్ల షేవింగ్ స్మూత్‌గా, సూపర్ ఫాస్ట్‌గా అయిపోతుంది.మరియు చర్మం పొడి బారకుండా హైడ్రేటెడ్ గా ఉంటుంది.