కొన్ని వీడియోలు అంతే మనసులను ఇట్టే దోచేస్తాయి అసలు అందులో ఎలాంటి మాటలు వినిపించకపోయినా సరే అవి మనసులను కదిలిస్తాయి.ఇక తల్లి ప్రేమకు సంబంధించిన ఘటనల్లో అయితే ఎలాంటి సంభాషనలు అక్కర్లేదు.
కేవలం ఎమోషన్ మాత్రమే కన్నీళ్లు తెప్పిస్తుంది.ఎందుకంటే ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఏది కూడా దరిదాపుల్లో లేదనే అనేక సందర్భాలు నిరూపించాయి.
ఆ తల్లి ఎలాంటి బాధాకర పరిస్థితుల్లో ఉన్నా కూడా తన పిల్లలను మాత్రం ఎప్పుడూ సంతోషంగానే చూడాలని అనుకంటుంది.
అయి కొందరు పిల్లలు అనారోగ్యంతో ఉంటే ఈ సమాజం వారిపట్ల వింత ధోరణి అవలంబిస్తుంది.
వారిని చిన్న చూపు చూస్తుంది.కానీ తల్లి మాత్రం వారిని ఎప్పుడూ అలా చూడకుండా తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది.
ఇక ఇప్పుడు కూడా ఓ తల్లి తన మానసిక వ్యాధితో బాధపడుతున్నా కూడా అతడిని సంతోషంగా ఉంచేందుకు ఆమె చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఆ మతి స్థిమితం సరిగ్గా లేని చిన్నారి బర్త్ డే రోజున తన తల్లి అతడికి ఒక మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్ గా ఇస్తుంది.
ఇక ఇది చూసిన ఆ పిల్లాడు ఎంతో సంతోషిస్తాడు.ఇక ఎంతో ఆప్యాయంగా ఆ పిల్లవాడిని తన తల్లి దగ్గరికి తీసుకొని ముద్దు చేయడం చూస్తే ప్రతి ఒక్కరినీ కదిలించక మానదేమో.ఎందుకంటే ఎలాంటి కల్మషం లేని ఆ పిల్లవాడు ఆ ఫోన్ ఓపెన్ చూసిన సమయంలో చూపించిన హావభావాలు ఎవరి మనస్సులను అయినా సరే ఎమోషన్‌కు గురి చేయాల్సిందే.ఇక ఈ వీడియోపై రియల్ మీ మొబైల్ కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ కూడా స్పందించారు.
ఎందుకంటే ఆ ఫోన్ రియల్ మీ కంపెనీది.ఆయన ట్వీట్ చేస్తూ తమ ఫోన్ ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నందుకు సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చారు.