రోడ్లపై వెళ్లేటప్పుడు ముఖ్యంగా పిల్లలు తిరిగే చోట చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలి.కానీ రోడ్ సెన్స్ లేని చాలామంది వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతుంటారు.
వీరి వల్ల ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.తాజాగా ఇలాంటి మరొక యాక్సిడెంట్( Accident ) వెలుగులోకి వచ్చింది.
ఓ ఏడు సంవత్సరాల బాలుడిని వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్ బలంగా ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మంజేశ్వర్ ( Manjeshwar )ప్రాంతానికి సమీపంలోని బలియూరులో( Baliyur ) ఈ సంఘటన జరిగింది.
కర్ణాటక-కేరళ సరిహద్దుకు కొద్ది దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది.బాలుడు ఢీకొన్న భయంకర క్షణాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.
ఆ ఫుటేజ్‌లో పైకార్ ఎంత స్పీడ్ గా వస్తున్నాడో స్పష్టంగా కనిపించింది.
అప్పటికే చాలామంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు.ఆ పిల్లలు రోడ్డు మధ్యలోకి వచ్చే అవకాశం ఉంటుంది వారికి తెలియదు కాబట్టి రోడ్డు దాటడంలో తప్పులు చేస్తారు.ఈ విషయం కూడా తెలియని ఆ బైకర్ అలానే స్పీడ్ గా వెళ్లాడు.
సీసీటీవీ ఫుటేజ్‌లో రోడ్డు దాటుతున్న ఓ బాలుడిని వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్ ( Motorcycle )వెనుక నుంచి ఢీకొట్టడం కనిపించింది.ఈ ప్రమాదం చూసిన వారు వెంటనే అక్కడ చేరుకున్నారు.
అంతేకాకుండా, ఓ బస్సు సంఘటనా స్థలంలో ఆగింది.అందులోని ప్రయాణికులు రోడ్డుపై తీవ్రంగా గాయపడి, నిస్సహాయక స్థితిలో ఉన్న బాలుడికి సహాయం చేయడానికి ప్రయత్నించారు.
బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియ రాలేదు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మోటార్‌సైకిల్ నడుపుతున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.నివేదికల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే మోటార్‌సైకిల్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
వైరల్ వీడియో చూసిన నెటిజన్లు రోడ్డు మీద అతివేగంగా వచ్చిన మోటార్‌సైకిల్ రైడర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.