న్యాచురల్ స్టార్ నానికి( natural star Nani ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.అష్టాచమ్మా సినిమాతో( Ashtachamma ) నాని కెరీర్ మొదలు కాగా తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను నాని ఖాతాలో వేసుకున్నారు.నాని హిట్3 మూవీ టీజర్ తాజాగా విడుదల కాగా ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.హిట్3 టీజర్ 24 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.టీజర్ లో కంటెంట్ అద్భుతంగా ఉండటం ఈ స్థాయిలో వ్యూస్ కు కారణమైంది.
దర్శకుడు శైలేష్ కొలను( Director Shailesh kolanu ) ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
కింగ్ డమ్ టీజర్ యూట్యూబ్ వ్యూస్ ను సైతం ఈ సినిమా సులువుగానే బ్రేక్ చేసింది.నాని హిట్3 సినిమాతో ( Hit3 movie )ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.
కింగ్ డమ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆ రికార్డ్ ను సైతం ఈ సినిమా సులువుగానే బ్రేక్ చేసిందని తెలుస్తోంది.

హిట్ యూనివర్స్ లో భాగంగా హిట్3 తెరకెక్కుతుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.అర్జున్ సర్కార్ పాత్రలో నాని జీవించారని కామెంట్లు వినిపిస్తుండగా ఈ సినిమాలో నానిని కొత్తగా చూడబోతున్నామని తెలుస్తోంది.మే నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
నాని సొంత బ్యానర్ పై హిట్3 సినిమా తెరకెక్కుతోంది.