సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు మంచి క్యారెక్టర్లు చేస్తు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు.మరి కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన వాళ్లకు సరైన గుర్తింపైతే రాదు.
కారణమేదైనా కూడా ఆయా నటులు వాళ్ళ ఓన్ వే లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించినప్పుడు మాత్రమే వాళ్ళు స్టార్లుగా రాణిస్తూ ఉంటారు.మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఉన్న చాలా మంది నటులు గొప్ప క్యారెక్టర్ లని పోషించినప్పటికి వాళ్లకు సరైన గుర్తింపైతే రావడం లేదు.

నిజానికి యంగ్ హీరోలు ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తున్నారు.కానీ వాళ్లకు సరైన గుర్తింపైతే రావడం లేదు. సందీప్ కిషన్ ( Sandeep Kishan )లాంటి నటుడు వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తున్నాడు.ఆ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోగా ఆయనకు మంచి గుర్తింపైతే రావడం లేదు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఎందుకు సందీప్ కిషన్ కి మంచి గుర్తింపు రావడం లేదు అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.ఇక ఆయన ఒక సినిమా విషయంలో మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాడట.ఒక్క ఆమ్మాయి తప్ప అనే సినిమా బాగుంటుంది.

కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఆయన చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్ళాడని ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.ఆయన చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయినప్పటికి ఈ ఒక్క సినిమా ప్లాప్ ఎందుకయింది అనేది ఆయనకి సరిగ్గా అర్థం కాలేదట… మొత్తానికైతే ప్రస్తుతం సందీప్ కిషన్ మజాకా సినిమాతో( Mazaka ) ‘మహాశివరాత్రి’ కానుక గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మరి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆయన స్టార్ హీరోగా మారుతాడు…
.