తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఆ నటిస్తూ దూసుకుపోతున్నారు.సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
కాగా చిరంజీవి చివరగా గాడ్ ఫాదర్ (godfather)మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల పర్వాలేదు అనిపించుకుంది.
దీంతో ఎలా అయినా తదుపరి సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర (Visvambhara)మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తాం అన్న విషయంపై ఇంకా మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
కానీ సమ్మర్ లో వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే తాజాగా తన కొత్త సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ఒక కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో (Directer Anil Ravipudi)నేను ఒక ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాను.ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుంది.పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం.
ఆ మూవీ సెట్స్ లో అడుగుపెట్టేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను.
దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో ఇప్పుడు అనిల్ తో అలాంటి ఫీలింగే ఉంది.ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.