తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు.మోహన్ బాబు తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న మంచు విష్ణు( Manchu Vishnu ) హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు.
కెరియర్ మొదట్లో ‘ఢీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన తర్వాత సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నాడు.కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ అవ్వడం లేదు.
తన తోటి హీరోలందరు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సందర్భంలో మంచు విష్ణు మాత్రం ఇంకా సక్సెస్ ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం 150 కోట్లు బడ్జెట్ తో కన్నప్ప( Kannappa ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) ఒక కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం.మరి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన మేకర్స్ ఆ పోస్టర్ కి మంచి ప్రశంసలు రావడంతో సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ వాళ్ళు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు.మరి వాళ్ళ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా? పాన్ ఇండియాలో( Pan India ) విష్ణు స్టార్ హీరోగా వెలుగొందుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక మంచు విష్ణు ఈ సినిమాను భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్నప్పటికి ఈ సినిమా ఎంత వరకు లాభాలను తీసుకొచ్చి పెడుతుంది ఎంతవరకు నష్టాలను మిగులుస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి విష్ణు కెరియర్ లోనే ఈ సినిమా మైలురాయిగా మిగులుతుందా లేదంటే తను ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ అవుట్ అయిపోవడానికి కారణం అవుతుందా అనేది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది…
.