కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ( Prabhas ) తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్న ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కూడా ప్రభాస్ గుర్తింపు పొందారు.ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న ప్రభాస్ మాత్రం చాలా సింపుల్ గా, ఏమాత్రం గర్వం లేకుండా చాలా సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటారు.

ఇక దానం చేసే విషయంలో కూడా ప్రభాస్ కి ఎవరు సాటిరారు.ఈయన నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందుకున్నారు అయితే ఈయనతో సహాయం పొందిన వారు బయటకు చెబితే తప్ప ప్రభాస్ సహాయం( Prabhas Help ) చేశారని ఎవరికీ తెలియదు.చిన్న సహాయం చేసిన పబ్లిసిటీ కోసం ఆ సహాయాన్ని బయటకు చెప్పుకునే సెలబ్రిటీలు ఉన్న ఈ రోజుల్లో కొన్ని ప్రాణాలను కాపాడిన ప్రభాస్ మాత్రం ఎప్పుడూ కూడా తాను చేసిన సహాయాన్ని బయట పెట్టుకోలేదు.తాజాగా ప్రముఖ సినీ రచయిత తోట ప్రసాద్( Writer Thota Prasad ) ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఈ సందర్భంగా తోట ప్రసాద్ మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి నెలలో నేను అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలయ్యాను.అదే రోజు నాకు సర్జరీ జరగాల్సి ఉంది సర్జరీకి అవసరమయ్యే డబ్బులు కూడా నా దగ్గర లేవు కానీ ప్రభాస్ గారికి ఈ విషయం తెలిసి వెంటనే డబ్బులు పంపించారు.అయితే నేను ఏ రోజైతే హాస్పిటల్ పాలయ్యానో అదే రోజు ప్రభాస్ గారి తండ్రి కూడా చనిపోయారు.ఇలా తన తండ్రి చనిపోయి కుటుంబం మొత్తం శోకసంద్రంలో ఉన్నారు.
ఇలా తండ్రి శవం పక్కనే ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ నాకోసం డబ్బు పంపించి నా ప్రాణాలను కాపాడారు ఆరోజు ఆయన సహాయం చేయకపోతే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు అంటూ ప్రభాస్ చేసిన సహాయం గురించి చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా తండ్రి చనిపోయిన రోజు కూడా ఇతరుల ప్రాణాలు గురించి ఆలోచించడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి ఇది తెలిసిన అభిమానులు మరి ఇంత మంచి వాడివి ఏంటి ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.