టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం మయోసైటిస్( Myositis ) అనే వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది.సమంతా రీ ఎంట్రీ( Samantha Re-Entry ) కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
చివరగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో( Khushi Movie ) నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది.
ఈ సినిమా తర్వాత మరే సినిమాలో నటించలేదు సమంత.

అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది.అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇక సమంత అభిమానులు రీ ఎంట్రీ ఎప్పుడు అంటూ గత కొంతకాలంగా కామెంట్లు చేస్తుండగా తాజాగా వీటిపై స్పందించింది సామ్.
ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది.హాయ్ సమంత బ్రో.తిరిగొచ్చేయండి.మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు అంటూ ఎవరో పోస్ట్ పెట్టగా.
దీనిపై స్పందించిన సమంత.తిరిగి వస్తున్నాను బ్రో అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.
ఈ సందర్భంగా రీసెంట్ గా తను నేర్చుకున్న జీవిత పాఠాన్ని కూడా బయట పెట్టింది.

3 రోజులు మౌనవ్రతం పాటించానని, రెండో రోజుకు ఫోన్ లేకుండా ఉండలేకపోయానని, మౌనం పాటించిన తర్వాత తనతో తాను మాట్లాడుకోగలిగానని, అది తన జీవితానికి ఎంతో పనికొస్తుందని అని తెలిపింది సామ్.అయితే సమంత రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే ఎవరి దర్శకత్వంలో నటించబోతోంది? ఆ సినిమా ఏది అన్న కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనప్పటికీ సమంత ఎంట్రీ కోసం అభిమానులు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా అని చెప్పాలి.
మరి సమంత కొత్త సినిమా గురించి ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మరి.