టాలీవుడ్ నటుడు ప్రముఖ కమెడియన్ బాబు మోహన్( Babu Mohan ) గురించి మనందరికీ తెలిసిందే.బాబు మోహన్ ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
ముఖ్యంగా కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) గారితో ఆయన చేసే కామెడీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.ఆయన తెరపై కనిపించారు అంటే చాలు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వాల్సిందే.
అంతలా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సినిమాలకు పూర్తి దూరంగా ఉన్న ఆయన అప్పుడప్పుడు రాజకీయాలలో కనిపిస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా పద్మ అవార్డు( Padma Award ) తనకు రాకుండా రాజకీయం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.నాకు పద్మ అవార్డులు ఎప్పుడో రావాలి.నా సన్నిహితులకు ఎప్పుడో వచ్చేసాయి.15, 20 ఏళ్ళ క్రితమే వాళ్లకు వచ్చేసాయి.నాకు కూడా అప్పుడే రావాలి.కానీ దీంట్లో కూడా కొంత రాజకీయం చేసారు.అవి రాలేదని కూడా బాధలేదు.ఎందుకూ పనికిరాని బుర్రకథ చెప్పేవాళ్లకు, చెట్టు కింద ఉండి అది వాయించుకునేవాళ్లకు ఇస్తున్నారు.కానీ ఇంత రంజింపచేసిన మాలాంటి వాళ్ళు కనపడట్లేదు వాళ్లకు.
మరి వాళ్ళు ఎలా అవార్డు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి.పద్మ అవార్డ్స్ కూడా స్టార్స్ కి, స్టార్స్ లాంటోళ్ళకి ఇవ్వాలి.

అలాంటోళ్ళకి కూడా ఇవ్వాలి.దాన్ని విమర్శించట్లేదు, అవమానించట్లేదు.కానీ అవార్డులకు ఒక విలువ ఇచ్చి విలువైన వాళ్లకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.అయినా అవార్డులు కాదు ప్రజల్లో ఉండాలి.డాక్టరేట్లు, వేరే అవార్డులు చాలా వచ్చాయి.ఏదైనా అవార్డే అని అన్నారు.
ఈ సందర్భంగా బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.అయితే బాబు మోహన్ తో కలిసి నటించిన తోటి కమెడియన్లు అయినా కోట శ్రీనివాసరావు గారికి 2015లో పద్మశ్రీ అవార్డు లాగా బ్రహ్మానందం కి 2009లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది.
కానీ ఇప్పటివరకు తనకు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బాబు మోహన్.