ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి ఏదో తెలుసా, అదే కాసోవరి(Cassowary).ఇది ఆస్ట్రేలియా, న్యూ గినియాలోని( Australia, New Guinea) దట్టమైన అడవుల్లో ఉంటుంది.చూడటానికి చాలా వింతగా, భయానకంగా ఉంటుంది.దీని తలకు హెల్మెట్ లాంటి కిరీటం, ముఖంపై ముదురు నీలం రంగు, కళ్లలో ఒకరకమైన క్రూరత్వం, భలే వింతగా అనిపిస్తుంది కదా.ఈ పక్షి సైజు చూస్తే షాక్ అవుతారు.మనిషి ఎత్తు ఉంటుంది, బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది.
వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి.గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు, అంతేకాదు ఏడు అడుగుల ఎత్తు వరకు గెంతగలదు.
వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, ఎగరలేకపోయినా, నీళ్లలో మాత్రం ఈత కొడుతూ దూసుకుపోతుంది.

చూడ్డానికి భయానకంగా ఉన్నా, కాసోవరి పక్షులు మనుషులతో అంతగా కలవవు, దూరంగానే ఉంటాయి.వాటిని కవ్విస్తే మాత్రం అంతే సంగతులు, కోపం వస్తే మాత్రం దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడవు.వాటి బలమైన కాళ్లతో గాల్లోకి ఎగిరి, పదునైన గోళ్లతో శత్రువులను చీల్చి చెండాడుతాయి.
మనుషులపై కూడా దాడి చేయగలవు జాగ్రత్త.పాపువా న్యూ గినియాలో కాసోవరి పక్షుల గురించి ఐదేళ్లు రీసెర్చ్ చేసిన ఆండ్రూ మాక్ (Andrew Mack)అనే శాస్త్రవేత్త ఏమన్నారంటే “వాటిని చూస్తే అచ్చం డైనోసార్లను చూసినట్లే ఉంటుంది.
అవి సజీవ డైనోసార్లలా అనిపిస్తాయి” అని చెప్పారు.నిజమే కదా, వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

కాసోవరి పక్షులు డేంజరే (Cassowary birds are dangerous)కానీ, వాటికి మనుషుల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది.వేట, అడవులు నరికివేయడం, రోడ్డు ప్రమాదాల వల్ల చాలా కాసోవరి పక్షులు చనిపోతున్నాయి.ఒకవేళ మీరు ఎప్పుడైనా కాసోవరి పక్షిని చూస్తే ఏం చేయాలో కోస్టల్ & కాసోవరి కన్జర్వేషన్ సంస్థ వ్యవస్థాపకుడు పీటర్ రోల్స్ ఏం చెప్పారు.“శాంతంగా ఉండండి.చేతులు వెనక్కి పెట్టుకోండి.హడావుడి చేయకండి.దగ్గరలో చెట్టు ఉంటే దాని వెనక్కి వెళ్లి దాక్కోండి.అస్సలు అరవకండి, చేతులు ఊపకండి, దాన్ని మీ వైపుకు తిప్పుకోకండి” అని జాగ్రత్తలు చెప్పారు.
కొన్ని ఆదిమవాసీ తెగలకు కాసోవరి పక్షులంటే చాలా గౌరవం.వాటిని సాంప్రదాయ నృత్యాల్లో, పూజల్లో, కథల్లో దేవుడిలా కొలుస్తారు.
ఇప్పుడు కొన్ని గిరిజన సంఘాలు ఈ అద్భుతమైన పక్షులను కాపాడటానికి నడుం బిగించాయి.నిజంగా ఇది చాలా గొప్ప విషయం.







