తెలుగు ప్రేక్షకులకు మహానటి కీర్తి సురేష్ ( Mahanati Keerthy Suresh )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే చివరగా బేబీ జాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా సమయంలోనే ఈమె మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
తెలుగులో చివరగా సర్కారు వారి పాట సినిమాలో నటించింది.ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
అందులో భాగంగానే తాజాగా మరొక విషయం తో వార్తల్లో నిలిచింది కీర్తి సురేష్.

అదేమిటంటే తాజాగా ఆమె ధరించిన డ్రెస్ ధర తెలిసి షాక్ అవుతున్నారు నెటిజెన్స్.ఇటీవల తన భర్తతో కలిసి ఒక పార్టీలో కీర్తి సురేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.దాంతో పార్టీలో అందరి చూపు కీర్తి సురేష్ డ్రెస్ పై పడింది.అయితే కీర్తి సురేష్ ధరించిన ఆ డ్రెస్సు గురించి సోషల్ మీడియాలో వెతకగా అది దాదాపుగా రూ.2.45 లక్షలు అని తెలుస్తోంది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధర తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.కీర్తి సురేష్ కు మంచి డిమాండ్ ఉంది.
తన స్కూల్ స్నేహితుడు ఆంటోనితో( Antony ) 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే వెల్లడించింది.

గత ఏడాది గోవాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు తన పెళ్లి తర్వాత పార్టీ సైతం అక్కడే జరిగినట్లు తెలుస్తోంది.కీర్తి సురేష్ ధరించిన గౌను అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ మెరిసే గౌనును రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా రూపొందించారట.ఇకపోతే కీర్తి సురేష్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ అలాగే సినిమాల్లో కంటిన్యూ అవుతుందా లేదంటే సినిమాలకు గ్యాప్ ఇస్తుందా అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఈ విషయం గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కానీ ఈ విషయంపై ఇంకా కీర్తి సురేష్ స్పందించలేదు.
అభిమానులు మాత్రం ఈ విషయం పట్ల కాస్త ఆందోళన చెందుతున్నారు.







