సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ప్రస్తుతం రాజకీయ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు ఆయన కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేసే పనులలో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరు మల్లు ( Hari Hara Veeramallu )చిత్రం కూడా ఒకటి.
ఈ సినిమా వచ్చేనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో పాటు అనసూయ ( Anasuya ) కూడా స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.ఈ క్రమంలోనే ఈ పాటలో పవన్ కళ్యాణ్ సరసన నటించడం కోసం అనసూయ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ( Remuneration ) తీసుకున్నారనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మరి పవన్ కళ్యాణ్ సినిమాలో భాగమైనందుకు అనసూయ రెమ్యూనరేషన్ ఎంత ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ పాటలో నటించడం కోసం అనసూయ రెండు రోజులు పని చేసినట్టు తెలుస్తుంది.ఇలా రెండు రోజుల కోసం ఈమె ఏకంగా 50 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.ఇలా 50 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
శ్రీ లీల వంటి స్టార్ హీరోయిన్ సైతం పుష్ప సినిమాలోని కిస్సిక్ పాటకు నాలుగు రోజులు పని చేయగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.అలాంటిది అనసూయ రెండు రోజులకు 50 లక్షలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
హీరోయిన్లకు సమానంగా ఈమె రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ఇలా అనసూయ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్న అనసూయ బుల్లితెరకు దూరంగా ఉన్నారని చెప్పాలి.







