సంక్రాంతి వస్తున్నాం సినిమా( Sankrantiki vastunnam ) థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మార్చి 1వ తేదీన జీ తెలుగు ఛానల్ లో ఈ సినిమా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.అయితే అదనపు సన్నివేశాలతో ఓటీటీలో ( OTT )ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి.5 నిమిషాలకు పైగా అదనపు సన్నివేశాలతో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
అయితే ఈ విషయాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఓటీటీలో అదనపు సన్నివేశాలతో మార్చి 1వ తేదీ సాయంత్రం నుంచి సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
బుల్లితెరపై, ఓటీటీలో ఒకే సమయంలో ప్రసారమైన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ వార్తల్లో నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా సీక్వెల్( Sequel to the movie ) పై అంచనాలు ఏర్పడుతున్నాయి.2027 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాయి.
దిల్ రాజు ( Dil raju )భవిష్యత్తు సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వెంకటేశ్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.స్టార్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు వెంకటేశ్ తో సినిమాను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
వెంకటేశ్ రాబోయే రోజుల్లో సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.