2023 సంవత్సరంలో మ్యాడ్ మూవీ( Mad movie )థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సినీ అభిమానులకు ఎంతగానో నచ్చింది.
కేవలం కోటిన్నర రూపాయల బడ్జెట్ ( one and a half crore rupees )తో తెరకెక్కిన మ్యాడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కగా తాజాగా మ్యాడ్ స్క్వేర్ టీజర్ విడుదలైంది.
టైటిల్ కు తగినట్టుగానే సినిమాలో రెట్టింగ్ వినోదం ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.అయితే సీక్వెల్ లో హీరోయిన్లు ఉన్నారో లేదో క్లారిటీ లేకుండా టీజర్ కట్ చేశారు.
యూత్ ను టార్గెట్ చేసి అద్భుతమైన కామెడీతో ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది.మార్చి నెల 29వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ ఏడాది చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఈ సినిమా మెప్పించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.మ్యాడ్ స్క్వేర్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తెచ్చిపెట్టడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ్యాడ్ స్క్వేర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments banner )కు ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతుండగా మ్యాడ్ స్క్వేర్ సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.మ్యాడ్ స్క్వేర్ మూవీ పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కిందని సమాచారం అందుతోంది.
నిర్మాతలకు ఈ సినిమా కళ్లు చెదిరే లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది.







