ఇటీవల రోజుల్లో చాలా మందిని కలవర పెడుతున్న సమస్యల్లో తెల్ల జుట్టు( white hair ) ఒకటి.ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది.
కానీ యువత సైతం తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.ప్రతి పది మందిలో ఒకరు తెల్ల జుట్టుతో సతమతం అవుతున్నారు.
ఈ క్రమంలోనే జుట్టును నల్లగా మార్చుకునేందుకు కలర్స్ వాడుతున్నారు.కానీ మార్కెట్లో లభ్యమయ్యే కలర్స్ లో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటాయి.
అవి జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా క్యాన్సర్ కు సైతం కారణం అవుతాయి.అందువల్ల సహజ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా బాగా వర్కోట్ అవుతుంది.మరి లేటెందుకు ఆ ఆయిల్ ( Oil )ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ( Coffee powder )వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి( Fenugreek powder ) వేసి వేయించాలి.
ఈ మూడు పదార్థాలు పూర్తిగా నల్లగా మారిన తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనె( coconut oil
) మరియు పావు కప్పు ఆముదం వేసి బాగా కలిపి సన్నని సెగ మీద మరిగించాలి.

రెండు నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.అనంతరం క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడారంటే మీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.తెల్లగా మారిన మీ జుట్టు సహజంగానే మళ్లీ నల్లగా మారుతుంది.నిగనిగలాడుతూ మెరుస్తుంది.
న్యాచురల్ పద్ధతిలో వైట్ హెయిర్ కు చెక్ పెట్టాలని భావిస్తున్న వారికి ఈ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.
షైనీ గా మెరుస్తుంది.