కర్ణాటకకు( Karnataka ) చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చిత్ర పురుషోత్తమ్( Chitra Purushotham ) పెళ్లి కూతురుగా మెరిసింది.కానీ, ఈమె మామూలు పెళ్లి కూతురిలా( Bride ) కనిపించలేదు.
పెళ్లి మండపంలోనే తన కండలు చూపిస్తూ అందరినీ షాక్‌కి గురి చేసింది ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్.ఈమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందులో కనిపించినట్లుగా ట్రెడిషనల్ కంజీవరం చీర, నగలతో కళ్యాణ లక్ష్మిలా ముస్తాబైంది చిత్ర.కానీ, మెడలో తాళి కట్టేలోపు ఒక్కసారిగా తనలోని బాడీ బిల్డర్‌ని( Body Builder ) బయటపెట్టింది.
అందరి ముందే సిక్స్‌ప్యాక్ కండలు చూపిస్తూ ఫోజులిచ్చింది.అసలు సిసలైన ట్రెడిషనల్ లుక్‌లో కూడా స్ట్రెంగ్త్ చూపించొచ్చని నిరూపించింది ఈ లేడీ బాస్.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ‘వావ్! ఎంత ఫిట్‌నెస్.’ అంటూ మెచ్చుకుంటున్నారు.మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.‘ఈ పెళ్లి కూతుర్ని చూస్తే అత్తమామలు ఇంట్లో గొడవ పెట్టుకోవడానికి కూడా భయపడతారు’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘ఈమె పెళ్లి నగలతో పాటు బాడీ బిల్డింగ్ మెడల్స్ కూడా వేసుకోవాల్సింది’ అని మరొకరు పంచ్ వేశారు.
అయితే, చాలా మంది మాత్రం చిత్ర ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.‘ఇలాంటి ధైర్యవంతులైన మహిళలు సమాజానికి స్ఫూర్తి.ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు ఉండాలి, ఇదే నిజమైన అందం’ అని కామెంట్స్ పెడుతున్నారు.
మొత్తానికి చిత్ర పురుషోత్తమ్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఫిట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మారుతున్న అందాల నిర్వచనాలు గురించి చర్చలు జరుగుతున్నాయి.ఏదేమైనా, చిత్ర మాత్రం తన పెళ్లి లుక్‌తో అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది, ‘కాన్ఫిడెన్స్‌తో ఏదైనా సాధ్యమే!’ అని ఆమె ఇచ్చిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.