టాలీవుడ్ హీరోయిన్ నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) బ్యూటీ విత్ లక్ష్మి( Beauty With Lakshmi ) అనే టాక్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ షో కి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ భార్య మహీపా కపూర్( Maheep Kapoor ) కూడా హాజరైంది.వీరిద్దరూ అందం, ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మి శ్రీదేవి( Sridevi ) కి సంబంధించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.
ఒకసారి నేను శ్రీదేవిని జిమ్ లో చూశాను.

తను ట్రెడ్ మిల్ పై పరిగెడుతోంది.అప్పుడు జిమ్ లోపలికి అడుగు పెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాను.అప్పుడు నేను శ్రీదేవిని చూడక తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉంది.
అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.ఎందుకు అంటే దక్షిణ భారతదేశంలో తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా సాధారణ విషయం.
ఎందుకో కానీ జుట్టుకు నూనె పెట్టుకోవడాన్ని నేనసలు ఇష్టపడేదాన్ని కాదు.కానీ ఎప్పుడైతే జిమ్ లో శ్రీదేవిని అలా చూశానో సడన్ గా నా మనసు మారిపోయింది.
అంతం గొప్ప పెద్ద నటి అయినా శ్రీదేవినే జుట్టుకు నూనె రాసుకుంది అంటే చాలా గొప్ప విషయం అని నాకు అనిపించింది.

తనెప్పుడూ సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చింది.అలా ఆ క్షణం ఆమెను చూసిన తర్వాత నేను నా మనసును మార్చుకున్నాను అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.ఈ సందర్బంగా మంచు లక్ష్మి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ కామెంట్స్ వైరల్ కావడంతో లక్ష్మి కి థాంక్స్ చెబుతూ మాకు తెలియని ఒక విషయాన్ని చెప్పారు.శ్రీదేవి గారు రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







