టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ నక్కిన త్రినాథరావుకు( Director Nakkina Trinadha Rao ) ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.ఈ డైరెక్టర్ తక్కువ సినిమాలే తెరకెక్కించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
కొన్నిరోజుల క్రితం హీరోయిన్ అన్షు( Anshu ) గురించి త్రినాథరావు నక్కిన చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.ఆ కామెంట్ల గురించి ఈ దర్శకుడు మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.
నేను కావాలని ఆ కామెంట్లు చేయలేదని నవ్వించాలనే ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయడం జరిగిందని దర్శకుడు వివరణ ఇచ్చారు.అక్కడ జరిగిందంతా అనుకోకుండానే జరిగిపోయిందని అంతే తప్ప కావాలని ఆమెపై కామెంట్స్ చేయలేదని డైరెక్టర్ పేర్కొన్నారు.
అనుకోకుండా నేను అలా అన్నా తప్పు చేసినట్టే భావించానని ఈ దర్శకుడు వెల్లడించారు.

స్టేజ్ పై మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అనిపించిందని త్రినాథరావు నక్కిన తెలిపారు.అందుకే అందరికీ నేను క్షమాపణలు చెప్పానని దర్శకుడు వెల్లడించారు.ఆ సమయంలో అన్షుకు ఏం జరిగిందో అర్థం కాలేదని డైరెక్టర్ పేర్కొన్నారు.
తను నాకు ఫోన్ చేసి ఏం జరిగిందో అడిగిందని విషయం మొత్తాన్ని ఆమెకు వివరించగా ఆమె అర్థం చేసుకుందని ఈ దర్శకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వివాదం జరిగిన సమయంలో నాకంటే అమ్మ బాగా డిస్టర్బ్ అయిందని ఇన్నాళ్లు కష్టపడి మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్నావని నాన్నా ఈరోజు ఎందుకు నోరు జారావని అమ్మ చెప్పిందని త్రినాథరావు నక్కిన చెప్పుకొచ్చారు.భవిష్యత్తులో జాగ్రత్తగా మాట్లాడాలని అమ్మ చెప్పిందని ఆయన అన్నారు.త్రినాథరావు నక్కిన మరో రెండు రోజుల్లో మజాకా సినిమాతో( Mazaka Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.