ప్రస్తుత పోటి ప్రపంచంలో చిన్న,పెద్దా తేడా లేకుండా అందరూ వెన్ను నొప్పితో భాద పడుతున్నారు.ఇందులో ఎక్కువగా భాదపడేది కుర్చీలని అంటిపెట్టుకుని కూర్చునే వాళ్ళు మరియు మహిళలు.
చిన్న పిల్లలకు వారి స్కూల్ బ్యాగ్స్ మోయలేక నడుం నొప్పితో బాధ పడేవాళ్లు అనేక మంది ఉన్నారు.ఈ వెన్నునొప్పి ప్రభావానికి కారణం ఒక్కటే తీరికలేని జీవితం గడపడమే.
ఎంత పని వత్తిడి ఉన్నా సరే మధ్య మధ్యలో కాస్త వెన్ను కి రెస్ట్ ఇవ్వడానికి లేచి నిలబడి అటూ,ఇటూ తిరుగుతూ ఉండాలి.అయితే వెన్ను నొప్పి నుండి ఉపసమనం కోసం ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది
ఒక గ్లాసు మజ్జిగలో మూడు స్పూన్ల సున్నపు తేట కలుపుకుని ప్రతీరోజు ఉదయం తాగితే,క్రమేపి నడుము నొప్పి తగ్గుతుందట.
అంతేకాదు,గవ్వపలుకు సాంబ్రాణి మిశ్రమం ని కర్జూరం లోపల ఉంచి దారంతో చుట్టి దోరగా కర్జూరం కాల్చి దానిని కొద్ది కొద్ది గా తినడం వలన కూడా నడుము నొప్పికి ఉపసమనం ఇస్తుందట.శొంటి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్ల జిల్లేడు ఆకులు కట్టినట్లైతే నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.