మాములుగా సినిమా ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎలా మారుతుందో చెప్పలేము.ఎందుకు అంటే సరైన సక్సెస్ అయ్యి ఒక్క హిట్ పడితే రాత్రికి రాత్రే జాతకాలు మార్చేస్తుంది.
అలా రాత్రికి రాత్రే జాతకాలు మారిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు.జాతకాలు మారిపోవడం మాత్రమే కాదు అవకాశాలు కూడా వస్తాయి.
అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు.ఈ హీరోయిన్ పట్టుమని నాలుగు సినిమాలు కూడా చేయలేదు.
అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదండోయ్ హీరోయిన్ కయదు లోహర్( Kayadu Lohar ).ఈమె రెండు తమిళ సినిమాలు అలాగే రెండు మలయాళ సినిమాలు( Malayalam movies ) చేస్తూ వస్తోంది.ఇలా ఈమె నటించిన సినిమాలలో డ్రాగన్ సినిమా కూడా ఒకటి.
ఈ సినిమా ఇటీవలే విడుదల అవ్వగా మంచి హిట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తోంది.
దాంతో తెలుగు సినిమా జనాల దృష్టి ఆమె మీదకు మళ్లింది.అయితే ఇప్పటికిప్పుడు ఓకే అయిన సినిమా సితార బ్యానర్( Sitara banner ) లో విశ్వక్ సేన్ ( Vishwak Sen )హీరోగా కళ్యాణ్ దర్శకత్వంలో తయారయ్యే సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారట.

అయితే ఈ సినిమా ఆమెకు తొలి సినిమా కాదు.ఎందుకంటే ఈమె గతంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాలో నటించింది.కానీ ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ముద్దుగుమ్మకు పెద్దగా గుర్తింపు రాలేదు.ఇప్పుడు డ్రాగన్ సినిమా హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మ పై అందరి దృష్టిపడింది.
ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఉందని చెప్పాలి.మరి ముఖ్యంగా చిన్న హీరోలు మిడ్ రేంజ్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్లు అసలు దొరకడం లేదు.
దొరికినా కాస్త సక్సెస్ వస్తే రేట్లు పెరిగిపోతున్నాయి.ఇలాంటి టైమ్ లో మంచి సక్సెస్ తో వచ్చింది కాయదు.
ఇక కెరీర్ ఆగదు.ఈమె నటించిన సినిమాలు ఒకటి రెండు హిట్ అయితే ఈమె తెలుగులో బిజీ అవడం ఖాయం అని తెలుస్తోంది.
మరి ఈ ముద్దుగుమ్మ అదృష్టం ఏమాత్రం ఉంటుందో చూడాలి మరి.