పాములు( Snakes ) ఎప్పుడు ఎక్కడ దాగి ఉంటాయో చెప్పలేం.అవి కంటికి కనిపించకుండా ఉండి చటుక్కున కాటేస్తాయి.
అంతే, పుటుక్కున ప్రాణాలు పోతాయి.ఇప్పటికే చాలామంది అలా ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు మాత్రం తృటిలో పాము కాటు( Snake Bite ) నుంచి తప్పించుకోగలిగారు తాజా వైరల్ వీడియోలో( Viral Video ) కూడా అదే జరిగింది.
అందులో ఒక్క క్షణం ఆలస్యమైతే ఓ యువకుడు ప్రాణాలు పోయి ఉండేవి.
కళ్లముందే కట్లపాము కాటేయడానికి వచ్చింది.
కానీ అదృష్టం కొద్దీ ఆ వ్యక్తి పెట్టుకున్న టోపీ( Cap ) అతన్ని కాపాడింది.ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చూస్తే మాత్రం గుండె గుభేలుమనడం ఖాయం.ఆ వీడియోలో ఒక వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు.
అతను ఏమీ తెలియకుండా తన పనిలో ఉండగా.ఒక కట్లపాము మాత్రం అతడి వెనకాలే మెల్లగా వస్తోంది.
పక్కనే ఉన్న ఫెన్స్ దూకి ఒక్కసారిగా అతని తలపైకి దూకింది.అది కాటేయడానికి ప్రయత్నించింది కానీ సరిగ్గా టోపీ అడ్డు రావడంతో పాము పట్టు తప్పింది.ఫలితంగా ఆ పాము కాటు వేయాల్సింది పోయి టోపీని లాగేసి కింద పడిపోయింది.
అసలు ఏం జరిగిందో అతనికి మొదట అర్థం కాలేదు.
ఎవరో తన టోపీని లాగేశారేమో అనుకున్నాడు.కానీ వెనక్కి తిరిగి చూస్తే.
టోపీని పట్టుకుని బుసలు కొడుతూ కనిపించింది కట్లపాము.ఆ దృశ్యం చూసి అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
నోట మాట రాలేదు.
“టోపీ అతన్ని కాపాడింది” అంటూ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయిపోయింది.ఇప్పటికే 7 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూసేశారు.చాలా మంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.అతను ఎంత అదృష్టవంతుడో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
“ఇతను నిజంగా లక్కీ” అని కొందరు కామెంట్ చేస్తే, “ఇప్పటినుంచి టోపీలు ఎక్కువుగా వాడటం మొదలుపెడతా” అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.“ఆ టోపీ హెల్మెట్ కంటే ఎక్కువ పనిచేసింది.” అని ఇంకొకరు నవ్వుతూ కామెంట్ పెట్టారు.“ఈ టోపీ అతని ప్రాణాల్ని నిలబెట్టింది” అని ఇంకొక యూజర్ రాసుకొచ్చారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.
కానీ ఈ వీడియో మాత్రం ప్రకృతి ఎంత ప్రమాదకరమో, అదృష్టం అనేది ఒక్కోసారి మనల్ని ఎలా కాపాడుతుందో కళ్లకు కడుతుంది.ఒక్క టోపీ ఆ వ్యక్తి ప్రాణాల్ని కాపాడింది అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు అని ఓ నెటిజన్ అన్నాడు.