కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి జ్యోతిక ( Jyothika )ఒకరు.ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జ్యోతిక ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ కేవలం కుటుంబం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు.
అయితే ప్రస్తుతం మాత్రం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే జ్యోతిక నటించిన తాజా సిరీస్ డబ్బా కార్టెల్( Dabba Cartel ).

ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది.ఈ క్రమంలోనే జ్యోతిక ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అయితే ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు తన ఫ్యామిలీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.జ్యోతిక భర్త నటుడు సూర్య ( Suriya ) కూడా స్టార్ హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

ఇదే విషయం గురించి యాంకర్ జ్యోతికను ప్రశ్నిస్తూ ఇంట్లో ఇద్దరు స్టార్స్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మీరు కూడా అందరిలాగే షూటింగ్స్ కి బాక్సులు తీసుకెళ్తారా అంటూ ఈమెకు ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నకు జ్యోతిక ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.నేను సూర్య ఇద్దరం స్టార్స్ అయినప్పటికీ కూడా మేము ఇంటి బయటనే మా స్టార్డం పక్కనపెట్టి ఇంట్లోకి ఒక సాధారణ వ్యక్తులుగానే అడుగు పెడతామని తెలిపారు.ఇంట్లోకి అడుగుపెట్టగానే మేం తల్లిదండ్రులమే.
పిల్లలకు బాక్స్‌లు ఇస్తాం.ప్రతి ఉదయం వారి బాక్స్‌ల గురించి ఆలోచిస్తాం.
వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తాం.అంటూ జ్యోతిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







