ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు కలిసి నటించారు.అలా నటించిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున ఒక్కరు.
వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలేంటో ఒక్కసారి చూద్దామా.ఇక అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా కలెక్టర్ గారి అబ్బాయి.
ఈ సినిమాని బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అయితే ఈ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించారు.ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా అగ్ని పుత్రుడు.ఈ సినిమాకి కే.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా రావుగారిల్లు.ఈ సినిమాలో నాగార్జున తన జీవిత పాత్రలో గెస్ట్‌లా కనిపించారు.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇధ్దరూ ఇద్దరే.
ఈ సినిమాకి ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా.ఇది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం శ్రీరామదాసు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం మనం.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున వచ్చిన ఆరో సినిమా.ఈ మూవీలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమానే నాగేశ్వర్ రావు చివరి చిత్రం.