ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు ఓ ఇంటర్వ్యూలో తీరిన చిరు చిరు కోరిక గూర్చి చెప్పుకొచ్చారు.ఇంతకీ ఆ కోరిక ఏంటి.
గొల్లపూడి ఏం చెప్పారో ఒక్కసారి చూద్దామా.అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు విలన్ పాత్రలో నటించారు.ఇక అపుడే చిరంజీవి హీరోగా ఎదుగుతున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి గొల్లపూడితో చనువు ఏర్పడింది.చిరు కథా రచయితగా పరిణతి చెందిన వ్యక్తి గొల్లపూడి పట్ల గౌరవ భావం చూపించేవారు.
ఆ సమయంలోనే చిరంజీవి తన మనసులోని కాంక్షను గొల్లపూడికి చెప్పారు.ఇంతకీ అదేంటంటేఅప్పటిదాకా నటించిన సినిమా షూటింగ్ ల్లో కాస్త పేరున్న నటుల ఆటోగ్రాఫ్ ల కోసం జనం క్యూలు కట్టేవారు.
అయితే అపుడు చిరంజీవికి తనకు పేరు ఎపుడు వస్తుందో, తన ఆటోగ్రాఫ్ కోసం జనాలు ఎపుడు వస్తారో అని అనుకుంటూ ఉండేవారంట.ఇక అది కాస్తా సినిమా సినిమా కు బలీయమైన కాంక్షగా మారింది.
చిరంజీవి తన కోరికను గొల్లపూడికు చెప్పుకున్నారు.
అయితే అప్పుడు గొల్లపూడి చిరంజీవితో ఇలా అన్నారంట.అదేంటంటే నీలో పైకి ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారంట.ఇక త్వరలోనే నీ కోరిక తీరుతుంది అని అన్నారు.
ఇక ఈ చిత్రం సినిమా షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరిగే టైంకు అంతకు ముందు సినిమాల వలన చిరంజీవి జనాలకు తెలిసింది.దాంతో షూటింగ్ చూడడానికి వచ్చిన గోదావరి జిల్లాల ప్రజలు చిరంజీవి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారంట.
కాగా.ఇలా ఆటోగ్రాఫ్ కోసం తన మీద ఎగబడడం చిరంజీవి చాలా ఆనందంగా గొల్లపూడికు చెప్పుకొచ్చారు.అంతేకాదు ఆ తరువాత తరువాత ఒక అభిమాని తన బొటన వేలు కోసుకుని తనకు నేత్హురు తిలకం దిద్దడం గూర్చి వింతగా ఉద్వేగంగా చిరంజీవి, గొల్లపూడికు చెప్పుకున్నారంట.చిరంజీవిలోని కోరికనే అతడిని స్టార్ హీరో రేంజ్ కి ఎదిగేలా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు
.