జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా అసలు కామెడీ అంటే ఏంటో, రియాలిటీ షో ని కామెడీ తో ఎలా నడపచ్చో చేసి చూపించింది ఈటీవీ.వాస్తవానికి ఇదొక భూతు షో అనే వారు ఒక వర్గం అయితే, ఆ మాత్రం కామెడీ లేకపోతే ఎలా అనే వారు మరికొందరు.
ఎందరు ఎమన్నా కూడా ఒక దశాబ్ద కాలంగా ఈ షో నడుస్తుంది, ఎంతో మంది కి జీవితం ఇస్తుంది.అయితే ఈ కేటగిరి లో కొన్నేళ్లుగా ఆ షో కి పెద్ద పోటీ లేదు కానీ ఈ మధ్య కాలంలో ఒకరి తర్వాత ఒకరు ఆ షో ను వదిలి వెళ్లిపోయారు.
పక్క ఛానెల్స్ లో ఎదో ఒక కామెడీ షో తో జడ్జిలు, కమెడియన్స్ అంత వెళ్ళిపోతూ వస్తున్నారు.కొంత మంది సినిమా అవకాశాల వల్ల బిజీ అయ్యారు.
ఇక ఈటీవీ కి ఇప్పుడు పోతున్న కమెడియన్స్ ని కాపాడుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారంలా అయిపోయింది.వెళ్లే వాళ్ళు వెళ్లిన ఏమాత్రం నిగ్రహం కోల్పోకుండా యువ కమెడియన్స్ కి అవకాశం ఇస్తూ షో ని నడిపిస్తుంది మల్లెమాల.
అయినా కూడా ఎక్కడో ఇంకా తేడా కొడుతూనే ఉంది.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ ఒక విషయం ఏమిటి అంటే జబర్దస్త్ కమెడియన్స్ పక్క ఛానెల్స్ కి వెళ్లిన కూడా పెద్ద కామెడి లో తేడా ఏమి లేకపోవడం తో ఆ షోస్ ఏవి కూడా క్లిక్ అవ్వలేదు.
అందుకే జనాలకు అవి పెద్దగా ఉన్నట్టు కూడా తెలియడం లేదు.అందులో శ్రీదేవి డ్రామా కంపెనీ కొంచం పర్లేదు అయినా జబర్దస్త్ ని అస్సలు దాటాలేదు.
ఇక పక్క ఛానెల్స్ పని ఎలాగూ అయిపొయింది కాబట్టి జబర్దస్త్ ఎలాగూ బాగానే ఉంటుంది కానీ జనాల్లో ఆ షో పై పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండాలంటే మాత్రం యువ కమెడియన్స్ అయినా ఫైమా, నూకరాజు, ఇమ్ము, వర్ష లాంటి కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేయాలి.పైగా ఫైమా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది.ఎలాగూ బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా ఆమె జబర్దస్త్ లో జాయిన్ అవుతుంది.నూకరాజు కూడా జాతి రత్నాలు షో లో బాగానే నవ్విస్తున్నాడు.ఇక మిగతా వారు కూడా బాగానే నవ్విస్తున్నారు.సీనియర్స్ అయినా చలాకి చంటి, అనసూయ, సుధీర్, గెటప్ శీను పర్మినెంట్ గా షో లో ఉండటం లేదు.
వస్తూ పోతు ఉంటారు అందుకే ఈ యూత్ కమెడియన్స్ ని ఈటీవీ కాపాడుకోవాలి.