టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(rakul preeth singh) గురించి మనందరికీ తెలిసిందే.రకుల్ తెలుగులో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్,రామ్ చరణ్, బెల్లంకొండ శ్రీనివాస్(Junior NTR, Allu Arjun, Ram Charan, Bellamkonda Srinivas) లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమె నటించిన సినిమాలు చాలా వరకు సక్సెస్ గా నిలిచాయి.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి మకాం కూడా మార్చేసింది.గత ఏడాది బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ(Jackie Bhagnani)ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రేమ వివాహంతో ఒకటైన ఈ జంట ఇటీవలే తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు.కాగా తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్.
ప్రస్తుతం బాలీవుడ్‌కి మకాం మార్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే సమయంలో తన భర్తను తాను మిస్ అవుతున్నట్లు తెలుపుతూ ఇంస్టాగ్రామ్(Instagram) లో ఒక పోస్ట్ చేసింది.సినిమా షూటింగ్ సమయంలో మా ఆయనను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది.ఆ సమయంలో అతనికి దూరంగా ఉన్నాను అనే ఫీల్ ను పోగొట్టుకోవడానికి ఆయన స్వెట్ షర్ట్స్ ను ధరిస్తాను అని చెప్పుకొచ్చింది.దాంతో పాటు ఒక సెల్ఫీ ఫొటోను పంచుకుంది రకుల్.
అందులో ఆమె జేబీ అనే పేరుతో భర్త పేరును సూచించే హుడీని ధరించి సినీ ప్రియులను ఆకట్టుకుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.