వైరల్ వీడియో: ఇలా ఉన్నరేంట్రా.. థియేటర్‌లో ఉచిత పాప్‌కార్న్ ఇవ్వడంతో ఏకంగా?

సినిమా హాల్( Cinema hall ) అనగానే అందరికీ గుర్తొచ్చేది పెద్ద తెర, గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్, అంతకు మించి టికెట్లతో పాటు ఖరీదైన స్నాక్స్.సాధారణంగా థియేటర్లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్‌ ధరలు ఎక్కువగా ఉంటాయి.

 A Viral Video Like This Along With Free Popcorn At The Theater, Cinema, Popcorn,-TeluguStop.com

అందువల్లే చాలా మంది ప్రేక్షకులు బయట నుంచి తమకు నచ్చిన ఫుడ్‌ తెచ్చుకెళ్లాలని అనుకుంటారు.కానీ చాలా థియేటర్లు ఈ ప్రక్రియను అనుమతించవు.

అయితే, సౌదీ అరేబియాలో( Saudi Arabia ) ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

సినిమా హాల్లోకి ఉచిత పాప్‌కార్న్‌( Free popcorn ) అందిస్తున్నదాన్ని వినియోగించుకునేందుకు ప్రేక్షకులు తమతో పాటు పెద్ద డబ్బాలు, బకెట్లను తెచ్చుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డైలాగ్ పాకిస్థాన్’( Dialogue Pakistan ) అనే సోషల్ మీడియా హ్యాండిల్ షేర్ చేసిన వీడియోలో.తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పెద్ద నీలిరంగు డ్రమ్‌తో సినిమా హాల్‌కు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది.

అతను కౌంటర్‌ వద్దకు చేరుకున్నప్పుడు అక్కడి సిబ్బంది ఆశ్చర్యంగా చూసి నవ్వడం ప్రారంభించారు.కానీ, థియేటర్‌ నియమాలను అనుసరించి, సిబ్బంది ఆ డ్రమ్‌ను తీసుకొని పాప్‌కార్న్‌తో నింపి తిరిగి అందజేశారు.

ఈ వీడియో కాస్త పాతదైనా, ఇప్పుడు మళ్లీ వైరల్‌ అవుతోంది.లక్షలాది మంది ఇప్పటివరకు ఈ వీడియోను వీక్షించారు.

సమాచారం ప్రకారం, ఈ థియేటర్‌ 30 సౌదీ రియాల్స్ (దాదాపు రూ.700) చెల్లిస్తే అపరిమిత పాప్‌కార్న్‌ అందిస్తామని ప్రకటించింది.ఈ ఆఫర్‌ వినియోగించుకునేందుకు ప్రేక్షకులు పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చుకుంటూ థియేటర్‌కు వస్తున్నారు.ఇది నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తూ వినోదానికి కొత్త దారి తీస్తోంది.ఇలాంటి కొత్త ఆఫర్లు సినిమా ప్రియులకు థియేటర్ అనుభూతిని మరింత వినోదభరితంగా మార్చేలా చేస్తున్నాయి.మీరు కూడా ఇలాంటి ఆఫర్‌ మీ దగ్గర ఉన్న థియేటర్లలో కనిపిస్తే ఎలాంటి రియాక్ష న్ ఇస్తారో?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube