యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.
కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్న లక్ష్మి ప్రణతికి ప్రేక్షకుల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.లక్ష్మీ ప్రణతి లేటెస్ట్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
మహేష్ భార్య నమ్రతతో( Namrata ) కలిసి ప్రణతి దిగిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అటు ప్రణతి ఇటు నమ్రత మోడ్రన్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
అటు మహేష్ సక్సెస్ వెనుక నమ్రత ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ వెనుక లక్ష్మీ ప్రణతి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వార్2 సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏప్రిల్ నెలలో జరగనుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్, మహేశ్ లకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతున్నాయి.

ఎన్టీఆర్, మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటించి సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్, మహేష్ రెమ్యునరేషన్ 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్, మహేష్ బాబు లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.