ఎన్ని చేసిన‌ చుండ్రు పోవడం లేదా.. అయితే ఇదే మీకు సొల్యూషన్!

చుండ్రు( dandruff ) అనేది అత్యంత కామన్ గా వేధించే సమస్యల్లో ఒకటి.వాతావరణంలో వచ్చే మార్పులు, కాలుష్యం, గ్యాప్ లేకుండా ప్రతిరోజు తలస్నానం చేయడం లేదా అస్సలు చేయ‌క‌పోవ‌డం, హెయిర్ వాష్ కు వేడి వేడి నీటిని ఉపయోగించడం, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల చుండ్రు అనేది బాగా ఇబ్బంది పెడుతుంటుంది.

 Best Solution To Get Rid Of Dandruff At Home! Dandruff, Dandruff Relief Remedy,-TeluguStop.com

తల చర్మం పొడిబారితే చుండ్రు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.మానసిక ఒత్తిడి, కొంత ఆహారపు అలవాట్లు కూడా చుండ్రుకు కార‌ణం కావొచ్చు.

ఏదేమైనా చుండ్రు తీవ్ర‌మైన అసౌక‌ర్యానికి గురిచేస్తుంది.

Telugu Riddandruff, Dandruff Remedy, Care, Pack, Healthy, Healthy Scalp, Remedy-

పైగా కొందరిలో ఎన్ని రకాల షాంపూలు మార్చిన కూడా చుండ్రు పోనేపోదు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నీమ్ పౌడర్( Neem powder )(వేపాకు పొడి) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( aloe vera gel ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

Telugu Riddandruff, Dandruff Remedy, Care, Pack, Healthy, Healthy Scalp, Remedy-

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే చుండ్రు సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.వేపాకు పొడి, విటమిన్ ఈ ఆయిల్, పెరుగు, అలోవెరా జెల్, నిమ్మరసం ఇవన్నీ చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడతాయి.

స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెడతాయి.తల చర్మాన్ని తేమగా మారుస్తాయి.

చుండ్రును సంపూర్ణంగా నివారిస్తాయి.పైగా ఇప్పుడు చెప్పకున్న రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగడం ప్రారంభమవుతుంది.

అలాగే కురులు దృఢంగా సైతం మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube