మనీ ప్లాంట్.( Money Plant ) ఈమధ్య కాలంలో చాలా మందిని ఆకర్షిస్తున్న మొక్క.
మట్టిలోనే కాదు నీటిలో కూడా మనీ ప్లాంట్ పెరుగుతుంది.పైగా మనీ ప్లాంట్‌కు సన్ లైట్ అవసరం లేదు.
ఇంట్లో ఓ మోస్తరు వెలుతురున్న ప్రదేశంలో ఉంచినా బాగా పెరుగుతుంది.మనీ ప్లాంట్ ఇంట్లో ఉండే సంపద ( Wealth ) పెరుగుతుందని, ఆర్థిక పురోగతి మెరుగుపడుతుందని ప్రజలు నమ్ముతుంటారు.
ఇంట్లో ఈశాన్య లేదా దక్షిణ-తూర్పు దిశలో మనీ ప్లాంట్ ను ఉంచితే అదృష్టం తీసుకువస్తుందంటారు.అదృష్టం, ఆర్థికపరమైన విషయాల గురించి పక్కన పెడితే.
ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
మనీ ప్లాంట్ కు గాల్లో ఉన్న హానికరమైన పదార్థాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉంది.
గాలి శుద్ధి చేసే( Air Purification ) మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి.ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే అది కార్బన్ డయాక్సైడ్ తగ్గించి, ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
అలాగే మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మనస్సు ఆహ్లాదకరంగా మారుతుంది.

మనీ ప్లాంట్ ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీని( Negative Energy ) హరిస్తుంది.మంచి వైబ్స్ ను తీసుకొస్తుంది.ఇక బాటిల్, కుండీలలో లేదా హ్యాంగింగ్ బాస్కెట్ లలో మనీ ప్లాంట్ ను పెంచితే ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది.
ఇంట్లో చక్కటి ఆకుపచ్చ వాతావరణాన్ని అందిస్తుంది.ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే కనుక దోమలు మరియు పురుగుల నియంత్రణకు అది ఎంతగానో సహాయపడుతుంది.

ఎక్కువ నీరు, సన్ లైట్ లేకుండా బతికే మొక్క కాబట్టి మనీ ప్లాంట్ ను మీరు ఆఫీస్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాల్కనీ, బాత్రూమ్ వంటి ప్రదేశాలలో సులభంగా పెంచుకోవచ్చు.వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం మంచిదని అంటారు.