ముంబై నగరంలో( Mumbai ) ఊహించని భీకర ఘటన చోటుచేసుకుంది.రోడ్డుపై ప్రశాంతంగా వెళ్తున్న ఆటోరిక్షాను( Auto Rickshaw ) ఒక్కసారిగా ట్రక్కు( Truck ) ఢీ కొట్టింది.
టైరు పేలి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో టైరు పేలుడు( Tire Explosion ) ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ మాత్రం చెవులు మూసుకుని దిగ్భ్రాంతిలో ఉండిపోయాడు.
ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ధ్వంసమైన ఆటో, పేలిన ట్రక్కు టైరు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
చుట్టూ జనం గుమిగూడారు.ఆటో డ్రైవర్( Auto Driver ) షాక్‌లో చెవి పట్టుకుని నిలబడి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.“టైరు పేలుడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉందంటే ఆటో మొత్తం పగిలిపోయింది” అని వీడియోలో ఒక వ్యక్తి చెబుతుండటం వినిపిస్తోంది.

“నాకేమీ వినపడటం లేదు” అని డ్రైవర్ అంటున్న మాటలు కలకలం రేపుతున్నాయి.టైరు పేలుడు ధాటికి డ్రైవర్ వినికిడి శక్తిని కోల్పోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, ఇది తాత్కాలిక నష్టమా లేక శాశ్వతమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదం ముంబైలో ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.అధికారులు కూడా దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.కానీ దీన్ని మాత్రం @abhimanyu1305 అనే ట్విట్టర్ యూజర్ ఫిబ్రవరి 13న షేర్ చేశాడు.ఈ 45 సెకన్ల నిడివి గల వీడియోకు 16 వేల దాక వ్యూస్ వచ్చాయి.
ఈ వైరల్ వీడియో( Viral Video ) రోడ్డు భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.టైర్ల పేలుళ్ల వల్ల ఎంతటి ప్రమాదం సంభవించవచ్చో ఈ ఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
సరైన వాహన నిర్వహణ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాద తీవ్రత చూసి చాలామంది షాక్ అవుతున్నారు.