హెయిర్ స్టైలింగ్ టూల్స్ లో హెయిర్ డ్రైయర్( Hair Dryer ) ఒకటి.ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ హెయిర్ డ్రైయర్ కనిపిస్తోంది.
సహజంగా జుట్టు ఆరాలంటే ఎక్కువ సమయం పడుతుంది.మరీ ముఖ్యంగా శీతాకాలం లేదా చల్లటి వాతావరణంలో.
అయితే జుట్టును వేగంగా ఆరబెట్టడంలో హెయిర్ డ్రైయర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఉద్యోగస్తులు, విద్యార్థులు, హౌస్‌వైఫ్‌లు లాంటి బిజీ వ్యక్తులు జుట్టు సహజంగా ఆరేవరకు వేచి ఉండలేక హెయిర్ డ్రైయర్ ను విసృతంగా వాడుతున్నారు.
అయితే హెయిర్ డ్రైయర్ వాడేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.హెయిర్ డ్రైయర్‌ను అధికంగా లేదా సరైన జాగ్రత్తలు లేకుండా వాడటం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
హెయిర్ డ్రైయర్ ఉపయోగించే సమయంలో వచ్చే హీట్ కారణంగా తేమ తగ్గి జుట్టు డ్రై మరియు రఫ్ గా మారుతుంది.అలాగే డ్రైయర్ ను అధికంగా వినియోగించడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది.

హెయిర్ డ్రైయర్ ఉపయోగించే సమయంలో వచ్చే వేడి వల్ల స్కాల్ప్ పొడిగా మారి చుండ్రు( Dandruff ) తలెత్తే ప్రమాదం ఉంటుంది.ఎక్కువ వేడి తట్టుకోలేక స్కాల్ప్‌లో అలర్జీ లేదా ఇర్రిటేషన్ రావచ్చు.హెయిర్ డ్రైయర్ ను అధికంగా వాడితే జుట్టు రూట్స్ బలహీనపడి వెంట్రుకలు ఊడి పోవచ్చు.హెయిర్ బ్రేకేజ్( Hair Breakage ) సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి.
కాబట్టి సమయం లేదు కచ్చితంగా అవసరం అనుకుంటేనే హెయిర్ డ్రైయర్ ను వాడండి.సమయం ఉంటే సహజంగానే జుట్టును ఆరబెట్టుకునేందుకు ప్రయత్నించండి.

ఇకపోతే హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడానికి ముందు హీట్ ప్రొటెక్టంట్ స్ప్రే లేదా సీరం వాడాలి.అలాగే హెయిర్ డ్రైయర్ ను మిడియం లేదా కూల్ సెట్టింగ్‌లో ఉపయోగించాలి.ఆరు నుంచి ఎనిమిది అంగుళాల దూరం నుంచి డ్రైయర్ ఉపయోగించాలి.హీట్ వల్ల కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి జుట్టుకు మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ లేదా సీరంలు అప్లై చేసుకుంటే నష్టాలు తక్కువగా ఉంటాయి.