చిన్న వయసులోనే ముడతలా? వర్రీ వద్దు ఈ హోం మేడ్ క్రీం ను ట్రై చేయండి!

వయసు పైబ‌డే కొద్ది చర్మంపై ముడతలు రావడం సర్వసాధారణం.కానీ కొందరికి మాత్రం ఎర్లీ ఏజ్ లోనే ముడతలు వస్తుంటాయి.

 Homemade Cream For Get Rid Of Early Age Wrinkles Details! Homemade Cream, Early-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, పలు రకాల మందుల వాడకం, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే చర్మ ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే ముడతలు వస్తుంటాయి.ఈ ముడతలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

ఈ క్రమంలోనే ముడతలను వదిలించుకోవడం కోసం ఏం చేయాలో తెలీక మదన పడుతూ ఉంటారు.

అయితే ఇకపై వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే ముడతలు మాయం అవ్వడమే కాదు.ముఖ‌ చర్మం యవ్వనంగా మరియు మృదువుగా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్‌ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు కోకో బటర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి, నాలుగు చుక్కలు రోజ్‌ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.

Telugu Tips, Cocoa Butter, Age Wrinkles, Face Cream, Homemade Cream, Latest, Ski

అంతే మన క్రీమ్ సిద్ధం.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని పూర్తిగా తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.

అనంతరం తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి స్మూత్ గా వేళ్ళతో కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Cocoa Butter, Age Wrinkles, Face Cream, Homemade Cream, Latest, Ski

ప్రతిరోజు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే ముడతలు క్రమంగా మాయమవుతాయి.చర్మం టైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.అలాగే ఈ హోమ్‌ మేడ్ క్రీమ్ ను వాడటం వల్ల డ్రై స్కిన్ సమస్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.చర్మం తేమగా మృదువుగా మారుతుంది.అంతేకాదు ఈ క్రీమ్ ను వాడటం వల్ల వయసు పెరిగినా వృద్ధాప్య ఛాయలు తలుపు తట్టకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.

కాబట్టి చిన్న వయసులోనే ముడతల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube