తులసి పాలు తాగడం వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.సరైన ఆహారపు అలవాట్లు ఉంటే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

 Are There So Many Health Benefits Of Drinking Tulsi Milk ,tulsi, Milk , Health-TeluguStop.com

అయితే సరైన ఆహారంతో పాటు పాలు తీసుకోవడం కూడా చాలా మంచిది.తులసి పాలు తాగడం వలన చాలా ప్రయోజనాలు చేకూరుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే.

తులసి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆయుర్వేద ఔషధాల తయారీలో సైతం తులసి పాలను వినియోగించడం జరిగింది.

అయితే తులసి, పాలు రెండు కలిపి తీసుకోవడం వలన తలనొప్పి, మైగ్రేన్( Migraine ) లాంటి సమస్యలు దూరం అవుతాయి.

అలాగే డిప్రెషన్ లాంటి ప్రమాదకరమైన సమస్యతో బాధపడేవారు తులసి ఆకులను మరిగించి తాగడం వలన ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.ఇక తులసి పాలు ఇమ్యూనిటీ పవర్( Immunity Power ) ను పెంచడంలో కూడా తోడ్పడతాయి.అంతేకాకుండా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్న తులసి పాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఉపయోగపడతాయి.

ఇక గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు తులసి పాలు తాగడం వలన ఆ సమస్యల నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది.ఇక మరికొందరు శ్వాస సంబంధిత సమస్యలతో, కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అయితే అలాంటి వారు తులసి పాలను తాగడం వలన ఆ సమస్య నుండి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.అంతేకాకుండా ప్రతిరోజు ఒక గ్లాస్ తులసి పాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా అంటువ్యాధుల ముప్పును తగ్గించడంలో కూడా తులసి పాలు తోడ్పడతాయి.ఇక ఆందోళన, ఒత్తిడిని( Anxiety ) వేగంగా తగ్గించడంలో కూడా తులసి పాలు బాగా ఉపయోగపడతాయి.

అయితే ఒకటిన్నర గ్లాసు పాలలో తులసి ఆకులను ఉడికించి తులసి పాలను సులువుగా తయారు చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube