పేద ప్రజలకు వైద్య సేవలు అందించండి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: అందరం కలిసి మిర్యాలగూడను అభివృద్ది చేసుకుందామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ ఐఎంఏ అధ్వర్యంలో నిర్వహించిన మిర్యాలగూడ నియోజకవర్గ డాక్టర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలంలో విష జ్వరాలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున,మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై డాక్టర్స్ యొక్క బాధ్యత అధికంగా ఉందని, అనారోగ్యంతో వచ్చిన పేషంట్స్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతతో వారికి సమహకరించాలని ప్రతిఒక్క డాక్టర్ ను కోరారు.

 Provide Medical Services To Poor People Mla Bathula Lakshmareddy, Medical Servic-TeluguStop.com

అలాగే టెస్ట్ లు అవసరమైన వరకు తప్ప అధికంగా రాసి ప్రజలకు ఆర్థిక భారాన్ని పెంచకూడదన్నారు.

ఆరోగ్యకరమైన మిర్యాలగూడ నీ తీర్చిదిద్దాలి అంటే మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరమని,గ్రామీణ ప్రాంతాలలో మీ అందరి తరుపున ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మీ సేవలను అందించడంతో పాటు విష జ్వరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరారు.

అనంతరం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ లక్ష్యంతో నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో డాక్టర్స్ అందరూ భాగస్వామ్యులై తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.

అలాగే ఆగస్టు 15 న మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించబోయే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్స్ అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని,నేను నా మిర్యాలగూడ అభివృదికి నేను మీకు ఎల్లపుడూ మీకు అందుబాటులో ఉంటూ మీకు సహకరిస్తానని,మీ సహకారం నాకు అందించండి మనం అందరం కలసి అభివృద్ది చేసుకుందామని అన్నారు.

అనంతరం ఐఎంఏ మిర్యాలగూడ డాక్టర్స్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి మా డాక్టర్స్ సహాయ సహకారాలు ఎల్లపుడూ అందిస్తామని తెలియజేశారు.వనమహోత్సవం కార్యక్రమంలో తాము కూడా తమ వంతుగా మొక్కలు నాటుతామని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో వారి వైద్య సేవలను అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ,ఐఎంఏ మిర్యాలగూడ అధ్యక్షుడు,డాక్టర్స్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube