గంజాయి టెస్ట్ కిట్స్ వచ్చేశాయ్... ఇక తప్పించుకోలేరు

నల్లగొండ జిల్లా: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్,గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది.ఒకప్పుడు ముఖ్యమైన నగరాలు, పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్,ఇప్పుడు మారుమూల పల్లెలకూ కూడా విస్తరించాయి.

 Cannabis Test Kits Have Arrived Cant Escape Anymore, Cannabis Test Kits , Ganja,-TeluguStop.com

ఇక గంజాయి అయితే అన్ని గ్రామాల్లోనా చాలా ఈజీగా దొరుకుతుంది.కొందరైతే పేరటి తోటల్లో గంజాయిని సాగు చేస్తున్నారు.

స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా గంజాయికి బానిసలవుతున్నారు.ఏమీ తెలియని వయస్సులో మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు.

భవిష్యత్తును పాడు చేసుకొని జైలు పాలవుతున్నారు.ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నట్లు తెలిసింది.

దీంతో తెలంగాణ పోలీసులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్లను ఏర్పాటు చేసి గంజాయి,మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు.

అయితే గంజాయిని పట్టుకుంటున్నారు కానీ, వాటిని సేవించే వారిని గుర్తించటం కష్టంగా మారుతోంది.

మద్యం తాగి వెహికల్ నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తుంటారు.అయితే గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు నిన్నటి వరకు ఎటువంటి మెషీన్లు అందుబాటులో లేవు.

ఇక నుంచి గంజాయి తాగేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు.వారి చేతికి ఆయుధాలు చిక్కాయి.

గంజాయి తాగే వారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లను అందిస్తున్నారు.నల్గొండ జిల్లా మునుగోడులో పైలట్ ప్రాజెక్టుగా ఈ కిట్లను పరీక్షిస్తున్నారు.

రెండ్రోజుల క్రితం పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన కొందరికి టెస్ట్ కిట్లతో పరీక్షించగా వారిలో 35 మంది గంజాయి తాగినట్లు తేలింది.దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

త్వరలో రాష్ట్రం మెుత్తం అన్ని పోలీస్ స్టేషన్లలోనూ గంజాయి కిట్లను పంపిణీ చేస్తామని పోలీసులు వెల్లడించారు.డ్రంగ్ అండ్ డ్రైవ్ తరహాలోనే ఈ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

గంజాయి సేవించే వారు ఇక నుంచి తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరించారు.ఇక గంజాయి సరఫరాకు అడ్డాగా మారిన ధూల్‌ పేటను గంజాయి ఫ్రీగా మార్చాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

ఆగస్టు 31లోగా ధూల్‌పేటను గంజాయి ఫ్రీగా మార్చాలన్నారు.ధూల్‌ పేటక గంజాయి ఎక్కిడి నుంచి వస్తుంది? ఎవరు తీసుకొస్తున్నారు? ఎలా తీసుకొస్తున్నారు? కొనుగోలు చేసేదెవరు? అనే విషయాలపై నిఘా పెట్టాలన్నారు.పోలీసుల సహకారంతో గంజాయి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube